Share News

TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో శాలరీ పెంపు

ABN , Publish Date - Feb 18 , 2025 | 08:16 AM

టీసీఎస్ ఉద్యోగుల జీతాలు త్వరలో పెరగనున్నాయి. మార్చి నెలలో జీతాలు పెరగొచ్చని, 4 నుంచి 8 శాతం మధ్య జీతాల పెంపు ఉంటుందని సమాచారం.

TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో శాలరీ పెంపు

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ టీసీఎస్ ఉద్యోగుల శాలరీలు పెంచేందుకు రెడీ అయ్యింది. మార్చిలో జీతాల్లో పెంపు ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి ఉద్యోగులు పెరిగిన జీతాలు అందుకోనున్నారు. అయితే, శాలరీ పెంపు ఈ మారు 4 నుంచి 8 శాతం మధ్య ఉంటుందని సమాచారం.

‘‘శాలరీ పెంపు సమాచారం మాకు అందింది. ఈ సారి 4 - 8 శాతం మధ్య ఉంటుందని తెలిపారు. ఈసారి శాలరీ పెంపు తక్కువగానే ఉందని చెప్పకతప్పదు’’ అని ఓ ఉద్యోగి జాతీయ మీడియాకు తెలిపారు.

2022 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఉద్యోగుల శాలరీలు సగటున 10.5 శాతం మేర పెరిగాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 7-9 శాతానికి పడిపోయింది. ఇక భారతీయ టాప్ ఐటీ కంపెనీలు అన్నింటిలో ఈసారి జీతాల పెంపు ఓమోస్తరు స్థాయిలోనే ఉండనుంది.


మార్కెట్లోకి బీవైడీ సీలయన్‌ 7

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికరంగంలో ఒడిదుడుకులు భారతీయ ఐటీ రంగంపై పడటమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో భారతీయ ఐటీ ఉద్యోగులు అత్యధిక స్థాయిలో శాలరీల పెంపు పొందిన విషయం తెలిసిందే. మరోవైపు, భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ శాలరీ పెంపునకు సంబంధించి ఫిబ్రవరి చివరికల్లా ఉద్యోగులకు సమాచారం ఇవ్వనుంది. ఇన్ఫోసిస్‌లో శాలరీ పెంపు 5 నుంచి 8 శాతం వరకూ ఉండొచ్చని అంచనా.


Magellanic Cloud: మాజిల్లానిక్‌ క్లౌడ్‌ భారీ విస్తరణ ప్రణాళిక.. రూ. 400 కోట్లు, 3,500 నియామకాలు

ఇక టీసీఎస్‌లో ప్రస్తుతం ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఈ మార్చి నెలాఖరు కల్లా మరో 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు టీసీఎస్ యోచిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇంతకంటే ఎక్కువ మందిని నియమించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇక టీసీఎస్‌లో శాలరీ పెంపు, వేరియబుల్ పేఔట్ చెల్లింపులు ఉద్యోగుల రిటర్న్ టూ ఆఫీస్‌ లింక్ చేసినట్టు కూడా తెలుస్తోంది. రిటర్న్ టూ ఆఫీస్ విధానాన్ని కంపెనీ 2024 మొదట్లో ప్రవేశపెట్టింది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 08:16 AM