Share News

Bank Holiday Today: ఈరోజు మే 31న బ్యాంకులకు సెలవు ఉందా లేదా..ఆర్బీఐ క్లారిటీ

ABN , Publish Date - May 31 , 2025 | 11:17 AM

నేడు మే 31, 2025 శనివారం. దీంతో అనేక మంది ఈ రోజున బ్యాంకులు బంద్ ఉంటాయని అనుకుంటారు. పలు కంపెనీలకు వారానికి రెండు రోజులు సెలవు ఉన్న నేపథ్యంలో, ప్రతి శనివారమూ బ్యాంకులు పనిచేయవన్న భావన కూడా పెరిగింది. అయితే దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.

Bank Holiday Today: ఈరోజు మే 31న బ్యాంకులకు సెలవు ఉందా లేదా..ఆర్బీఐ క్లారిటీ
May 31 bank holiday

ఈరోజు మే 31, 2025 శనివారం. చాలామంది ఈరోజు బ్యాంకులకు సెలవు (Bank Holiday Today) అని అనుకుంటారు. మరికొంత మంది మాత్రం ప్రతి శనివారం కూడా బ్యాంకులు ఉండవని భావిస్తుంటారు. కానీ అందులో నిజం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్లారిటీ ఇచ్చింది. ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం, బ్యాంకులు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, ప్రతి ఆదివారం మాత్రమే బంద్ ఉంటాయని తెలిపింది.

ఇక మిగిలిన శనివారాల్లో, అంటే మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఈరోజు మే 31న ఐదో శనివారం కావడం వల్ల బ్యాంకులు తెరిచి ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ బ్యాంకు పనులను నిర్వహించుకోవచ్చు.


ఇతర బ్యాంక్ సెలవులు

వారాంతపు సెలవులు కాకుండా, బ్యాంకులు కొన్ని జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగల కారణంగా కూడా బంద్ ఉంటాయి. ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. అందువల్ల మీరు మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించే ముందు స్థానిక సెలవుల గురించి తెలుసుకోవడం కూడా మంచిది.


తర్వాతి బ్యాంక్ సెలవు ఎప్పుడు?

తర్వాతి బ్యాంక్ సెలవు జూన్ 1, 2025 (ఆదివారం)న ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఆదివారం మూసివేయబడతాయి.

జూన్ 2025లో రానున్న ముఖ్యమైన బ్యాంక్ సెలవులు

  • జూన్ 6 (శుక్రవారం) – ఇద్-ఉల్-అధా (బక్రీద్): కేరళలో బ్యాంకులు బంద్ ఉంటాయి

  • జూన్ 7 (శనివారం) – బక్రీద్ (ఇద్ ఉజ్-జుహా): దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే

  • జూన్ 11 (బుధవారం) – సంత్ గురు కబీర్ జయంతి / సాగ దవా: సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు హాలిడే

  • జూన్ 27 (శుక్రవారం) – రథయాత్ర / కాంగ్: ఒడిశా, మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు

  • జూన్ 30 (సోమవారం) – రెంనా నీ: మిజోరంలో బ్యాంకులకు సెలవు


బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఏం చేయాలి

బ్యాంకులు మూసి ఉన్నపుడు మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందవచ్చు. ఉదాహరణకి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ ట్రాన్స్ ఫర్ (NEFT, RTGS, IMPS) వంటివి చేసుకోవచ్చు. డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం, ATMల ద్వారా నగదు ఉపసంహరణ వంటి పనులను ఈజీగా నిర్వహించుకోవచ్చు.


ఇవీ చదవండి:

మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 12:40 PM