Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుదలపై IRDAI కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:14 PM
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా విషయంలో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రతి ఏటా పరిమితికి మించి పెంచుతున్న రేట్లకు పరిమితి విధించి, బీమా కంపెనీలు పాటించాలని ఆదేశించింది.

సాధారణంగా మాములు వ్యక్తులతో పోల్చుకుంటే ఆరోగ్య బీమా (health insurance) సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ప్రతి ఏటా కూడా ప్రీమియం మారిపోతూ ఉంటుంది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు IRDAIని ఆశ్రయించారు. దీంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సంవత్సరానికి 10 శాతం కంటే ఎక్కువ ప్రీమియం పెంచొద్దని బీమా కంపెనీలను ఆదేశించింది. దీంతో సీనియర్లు బారీగా పెరుగుతున్న ప్రీమియం పెంపుదల నుంచి ఉపశమనం పొందనున్నారు.
ఈ నిర్ణయం ఎందుకంటే..
ఈ నిర్ణయంపై పెరుగుతున్న ప్రీమియం రేట్ల వల్ల సీనియర్లపై ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా పడుతుందని ప్రోబస్ డైరెక్టర్ రాకేష్ గోయల్ తెలిపారు. ఆ క్రమంలో కొన్ని సార్లు అనేక మంది సీనియర్లు కొన్ని సార్లు సంవత్సరాలకు 20 నుంచి 30 శాతం పెరుగుదలను కూడా చూశారని తెలిపారు. దీని వల్ల పలువురు వారి బీమాను మధ్యలోనే ఆపేసినట్లు తెలిపారు. ప్రస్తుతం IRDAI తీసుకున్న నిర్ణయం ద్వారా అనేక మంది సీనియర్లకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. దీంతో పాటు ప్రీమియంలో ప్రతి ఏడాది ఊహించని విధంగా పెరుగుదల మార్పు ఉండదు కాబట్టి, సీనియర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాలసీదారులపై ప్రభావం
గతంలో ప్రతి సంవత్సరానికి వీటి ధరల్లో పెరుగుదల ఎక్కువగా ఉండేది. దీని వల్ల వయోవృద్ధులు ఇబ్బందులు పడేవారు. తాజా నిర్ణయంతో పాలసీదారులకు ఆకస్మిక ఆర్థిక భారం లేకుండా కవరేజీని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్లకు ఆరోగ్య బీమా చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ మంది తమ ఆరోగ్య బీమాను మరింత ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం ఉంటుంది.
బీమా సంస్థలపై కూడా..
ఈ సర్క్యూలర్ పాలసీదారులను రక్షిస్తున్నప్పటికీ, బీమా సంస్థలు తమ బడ్జెట్ పరిమితులను పరిగణించాలని చెబుతున్నాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులు, క్లెయిమ్ రేట్ల విషయంలో లాభాలను తగ్గిస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో పలు బీమా సంస్థలు వృద్ధులకు బీమాను విక్రయించడాన్ని కూడా పునరాలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మార్కెట్ ప్రత్యామ్నాయాలను తగ్గించవచ్చన్నారు. ఈ క్రమంలో బీమా సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు కొత్త పద్ధతులను అవలభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News