Recharge Price Increase: మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఈసారి ఎంతో తెలుసా..
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:33 PM
మొబైల్ యూజర్లకు మరోసారి షాకింగ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో రీఛార్జ్ ధరలు 10% నుంచి 12% వరకూ పెరిగే అవకాశముందని (Recharge Price Increase) తాజా నివేదికలు సూచిస్తున్నాయి. గత జూలై 2024లో టెలికాం కంపెనీలు ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ల ధరలను 11% నుంచి 23% వరకు పెంచాయి.

మొబైల్ యూజర్లకు మళ్లీ షాకింగ్ న్యూస్. ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ రీఛార్జ్ ధరలు 10 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని (Recharge Price Increase) నివేదికలు చెబుతున్నాయి. గత జులై 2024లో ఇప్పటికే టెలికాం కంపెనీలు ధరలను 11 నుంచి 23 శాతం వరకు పెంచాయి. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రీఛార్జ్ ప్లాన్స్ మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే, ఈసారి కంపెనీలు కొత్త విధానాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. మధ్య స్థాయి, ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులపై ఈ ధరల పెంపు ఎక్కువగా ఉంటుందని తెలిసింది.
మళ్లీ పెంపు ఎందుకు
భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ టెలికాం సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయనున్నాయని ఓ నివేదిక తెలిపింది. గత ధరల పెంపు తర్వాత కేవలం 18 నెలల్లోనే మరోసారి ధరలు పెరగడం వినియోగదారులకు నిజంగా ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు. అయితే, ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం మే నెలలో యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడమని అంటున్నారు. దీంతో భారత టెలికాం రంగంలో మొత్తం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. వీరి అవసరాలకు సంబంధించి సెకండరీ సిమ్‌లు మళ్లీ వినియోగంలోకి రావడం కూడా ఒక కారణమని చెబుతున్నారు.
తక్కువ ధర ప్లాన్స్ మాత్రం..
తక్కువ ప్లాన్‌ల ధరలను పెంచితే, వినియోగదారులు ఇతర టెలికాం కంపెనీలకు మారే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే, తక్కువ ధరల ప్లాన్‌లను అలాగే ఉంచి, ఎక్కువ ధరల ప్లాన్‌ల ధరలను పెంచాలని చూస్తున్నాయి. ఈ ధరల పెంపు విధానంలో కంపెనీలు డేటా వినియోగం, డేటా స్పీడ్, ఎక్కువ డేటా వినియోగం ఆధారంగా వినియోగదారులను విభజించే అవకాశం ఉందని సమాచారం.
లాభాలను పెంచుకోవడానికి..
ఈ విధానం ద్వారా కంపెనీలు తమ వినియోగదారులను ఇతర నెట్‌వర్క్‌లకు కోల్పోకుండా, ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మొత్తంగా ఈ ధరల పెంపు మాత్రం వినియోగదారులకు అదనపు భారం కావొచ్చు. అయినప్పటికీ టెలికాం కంపెనీలు తమ వ్యాపార లాభాలను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ మార్పులు ఎలా అమలవుతాయి. వినియోగదారులు దీనిని ఎలా స్వీకరిస్తారనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి