Insurance: బీమా సవరణ బిల్లుపై కీలక అప్‌డేట్.. ఇకపై గట్టి పోటీ
ABN , Publish Date - Apr 27 , 2025 | 06:12 PM
భారత బీమా రంగం మరింత బలోపేతం కానుంది. అవును, ఇదే సమయంలో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే బీమా సవరణ బిల్లులో అనేక మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

భారత బీమా రంగంలో కొత్త కొత్త మార్పులు రానున్నాయి. అవును రాబోయే రోజుల్లో మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచే ప్రతిపాదనతో ఉన్నారు. అందుకు సంబంధించిన బీమా సవరణ బిల్లు త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముసాయిదా సిద్ధంగా ఉంది. త్వరలో కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు. ఆ తర్వాత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియ మొదలవుతుంది.
ఈ మార్పుల వెనుక ఉద్దేశం ఏంటి
బీమా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార అవకాశాలు విస్తరించడం ప్రధాన లక్ష్యం. ఇకపోతే, వినియోగదారులకు కూడా మరిన్ని ఆఫర్లు ఉంటాయి. ప్రైవేటు పెట్టుబడులు పెరిగితే, ఇంకొన్ని కొత్త కంపెనీలు మార్కెట్లోకి వస్తాయి. తద్వారా వినియోగదారులు మెరుగైన సేవలను పొందడంతోపాటు ఆఫర్లు పొందే ఛాన్సుంది.
బడ్జెట్ నుంచి మొదలైన మార్పు
2024 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ ప్రతిపాదన ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. ఇది ఆర్థిక రంగాన్ని ఆధునీకరించే విస్తృత సంస్కరణల భాగంగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 74 శాతం FDI పరిమితిని పూర్తిగా తొలగించి, విదేశీ కంపెనీలు భారత బీమా కంపెనీలలో 100 శాతం వాటాను స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
బీమా చట్టానికి కీలక సవరణలు
ఈ బిల్లు ద్వారా కేవలం FDIని పెంచడం మాత్రమే కాదు, ఇతర కీలక మార్పులు కూడా వస్తున్నాయి
చెల్లించిన మూలధన అవసరాలు తగ్గింపు
మిశ్రమ లైసెన్సులు (Composite Licenses) అనుమతించడం
ఏజెంట్లకు బహుళ సంస్థల ఉత్పత్తులు విక్రయించే స్వేచ్ఛ
ప్రత్యేక ఏజెంటు మోడల్ నుంచి బయటకు రావడం
ఇవన్నీ బీమా రంగంలో పోటీని పెంచి, వినియోగదారులకు కొత్త అవకాశాలను అందించనున్నాయి
మూడు ప్రధాన చట్టాల్లో సవరణలు
బీమా చట్టం – 1938
LIC చట్టం – 1956
IRDAI చట్టం – 1999
LIC బోర్డుకు మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా LIC చట్టాన్ని కూడా సవరించనున్నారు. ఈ మార్పులు LIC వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయి.
పాలసీదారుల ప్రయోజనాలపై దృష్టి
ఈ ప్రతిపాదిత మార్పులు కేవలం పెట్టుబడులకు సంబంధించి కాకుండా, పాలసీదారుల భద్రత, సేవల నాణ్యత వంటి అంశాలపై దృష్టి పెడతాయి. ఎటూ చూసినా, బీమా మార్కెట్లో పోటీ పెరగడం వల్ల వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు, తక్కువ ప్రీమియం, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి ప్రయోజనాలు వచ్చే ఛాన్సుంటుంది.
కీలక మార్పులు
ప్రస్తుతం దేశంలో: 25 జీవిత బీమా సంస్థలు, 34 జనరల్ బీమా సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి రావడం ద్వారా మౌలిక సదుపాయాల పెరుగుతాయి. దీంతోపాటు సాంకేతికత ఆధారిత సేవలు అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్రాల, గ్రామీణ ప్రాంతాల వరకు బీమా సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News