Income Tax 2025 New Rules: ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:52 PM
ఇన్‌కం ట్యాక్స్ 2025 ఫైలింగ్ విషయంలో కొత్త మార్పులు (Income Tax 2025 New Rules) వచ్చాయి. ఈ మార్పులు పన్ను దాఖలు ప్రక్రియను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనలు తెలుసుకుని ముందుగానే పాటించడం ద్వారా, ఫైలింగ్ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

Income Tax 2025 New Rules: మీరు ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా. అయితే ఓసారి కొత్తగా మారిన రూల్స్ గురించి తెలుసుకోండి మరి. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి OTP ప్రమాణీకరణని తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానాన్ని భద్రతను పెంచడం, దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల వివరాల గుర్తింపును నిర్ధారించడం కోసం అమలులోకి వచ్చింది. ఈ మార్పులు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి ఉద్దేశించినవి.
ఎందుకు తప్పనిసరి
ఈ రూల్ అనధికార మార్పులను నిరోధించడానికి రూపొందించారు. ఆ క్రమంలో ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. దీనివల్ల నిజమైన ఖాతాదారుడు మాత్రమే సంప్రదింపు వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఖాతా హ్యాకింగ్ లేదా దుర్వినియోగం అవకుండా రక్షిస్తుంది. కాగా, డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పన్ను దాఖలు, రీఫండ్ ప్రక్రియను మరింత సురక్షితంగా చేసేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
కొత్త పాన్ కార్డ్ దరఖాస్తులకు ఆధార్ తప్పనిసరి..
జూలై 1, 2025 నుంచి కొత్త పాన్ కార్డ్ దరఖాస్తులకు ఆధార్ తప్పనిసరి చేశారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ OTP ప్రమాణీకరణ పూర్తి చేయాలి. ఆధార్ లేకపోతే కొత్త పాన్ కార్డ్ జారీ చేయబడదు. గతంలో డేట్ ఆఫ్ బర్త్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ తొలగించబడింది. ఇప్పటికే పాన్ కార్డ్ కలిగి ఉండి, దానిని ఆధార్‌తో లింక్ చేయని వారు డిసెంబర్ 31, 2025 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. లేకపోతే, వారి పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. ఆలస్యంగా లింక్ చేస్తే రూ. 1,000 జరిమానా విధిస్తారు.
పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలి
ఇమెయిల్/మొబైల్ నంబర్ అప్‌డేట్: ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సంప్రదింపు వివరాలను మార్చాలనుకునే వారు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి ప్రమాణీకరణ పూర్తి చేసుకోవాలి.
కొత్త పాన్ దరఖాస్తు: కొత్తగా పాన్ కార్డ్ కోసం అప్లై చేసేవారు ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా అందించాలి. OTP ప్రమాణీకరణ పూర్తి చేయాలి
పాన్-ఆధార్ లింకింగ్: ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారు 2025 డిసెంబర్ 31లోపు ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేకపోతే జరిమానాతో పాటు పాన్ నిరుపయోగంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి