Investment Tips: రూ. 9 వేల పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.7 కోట్లు, ఎప్పుడొస్తాయంటే..
ABN , Publish Date - Jul 07 , 2025 | 09:53 PM
కోటీశ్వరులు కావాలని అనేక మంది భావిస్తుంటారు. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత మంది మాత్రమే.. క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను (Investment Tips) పాటిస్తుంటారు. అయితే కొన్నేళ్లపాటు నెలకు రూ.9 వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఈజీగా రూ.7 కోట్లకుపైగా మొత్తాన్ని దక్కించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని, భవిష్యత్తులో కోటీశ్వరులు కావాలని చాలా మంది కలలు కంటున్నారు. కానీ, ఈ లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి మార్గం ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మంచి ఛాయిస్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనిలో చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం (Investment Tips) ద్వారా దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించుకోవచ్చని అంటున్నారు.
రూ.7.74 కోట్లు ఎలా సాధ్యం?
ఉదాహరణకు మీరు నెలకు రూ.9,000 SIPలో పెట్టుబడి పెడితే, 33 ఏళ్ల తర్వాత మీరు రూ.7,74,91,820 విలువైన సంపదను సృష్టించవచ్చు. అవును మీరు చదివింది నిజమే. అంటే 396 నెలల్లో మొత్తం పెట్టుబడి రూ.35,64,000 అవుతుంది (9,000 x 396). ఈ పెట్టుబడిపై సంవత్సరానికి 15% సగటు వార్షిక రాబడి (CAGR - Compound Annual Growth Rate) ప్రకారం చూస్తే, ఈ మొత్తం రూ.7,74,91,820కి చేరుకుంటుంది. ఇక్కడ మీరు పెట్టిన మొత్తం రూ.35,64,000 కాగా, వడ్డీ రూపంలోనే మీకు రూ.7,39,27,820 వస్తుంది. అంటే ఈ సంపదలో మీకు 95% కంటే ఎక్కువ వడ్డీ ద్వారానే లభిస్తుంది.
15% రాబడి ఎలా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఫండ్స్, దీర్ఘకాలంలో 12-21% లేదా అంతకంటే ఎక్కువ రాబడిని అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. గత డేటాను పరిశీలిస్తే, భారతదేశంలోని అనేక ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలంలో ఈ స్థాయి రాబడిని అందించాయి. అయితే, దీనిలో మార్కెట్ రిస్క్‌ను కూడా గమనించాలి. ఈక్విటీ పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతాయి కాబట్టి, దీర్ఘకాల పెట్టుబడి విధానం, మంచి ఫండ్స్ ఎంచుకోవడం చాలా కీలకం. సిప్ విధానం యువతకు, ముఖ్యంగా ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు లేదా దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను సాధించాలనుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ధరలు తక్కువగా ఉన్నప్పుడు..
ఇందులో మీరు నెల వారీగా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. ఈ మొత్తం మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించబడుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో కూడా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ (Rupee Cost Averaging) ప్రయోజనం లభిస్తుంది. అంటే, మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను, ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేయడం ద్వారా సగటు ఖర్చు తగ్గుతుంది.
అసలు రహస్యం ఇదే..
ఈ భారీ రాబడి వెనుక ఉన్న రహస్యం కాంపౌండింగ్ పవర్. కాంపౌండింగ్ అనేది వడ్డీపై వడ్డీ సంపాదించే ప్రక్రియ. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం పైన వచ్చే రాబడి మళ్లీ పెట్టుబడిగా మారి, దానిపై మళ్లీ రాబడి వస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంలో కొనసాగితే, మీ సంపద గణనీయంగా పెరుగుతుంది. 33 ఏళ్ల వంటి దీర్ఘ వ్యవధిలో ఈ కాంపౌండింగ్ ప్రభావం అద్భుత ఫలితాలను అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి