Share News

Education Loan: ఉన్నత చదువుల లోన్ కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో.. ఎలా అప్లై చేయాలంటే

ABN , Publish Date - Apr 20 , 2025 | 07:19 PM

గతంలో విదేశాలకు వెళ్లి చదవాలంటే దాదాపు రూ.10 నుంచి రూ.20 లక్షలు అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలోనే ఈ స్థాయికి మించిన ఖర్చు అవుతోంది. దీంతో అనేక మంది కూడా విద్యా రుణాల కోసం చూస్తుంటారు. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Education Loan: ఉన్నత చదువుల లోన్ కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో.. ఎలా అప్లై చేయాలంటే

ప్రస్తుత రోజుల్లో ఉన్నత విద్య కేవలం చదువు మాత్రమే కాదు. అది ఒక కల మాదిరిగా మారిపోయింది. ఎందుకంటే నర్సరీ స్థాయిలోనే ప్రస్తుతం అనేక స్కూళ్లు లక్షల ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఇక ఇన్నత విద్య వరకు వెళితే మాత్రం కోట్ల రూపాయలు కావాల్సిందే. వీటి కోసం అనేక బ్యాంకులు లోన్స్ కూడా అందిస్తున్నాయి. దేశీయంగా చదవాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా కూడా మీరు లోన్స్ ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాదు విద్యా రుణాలకు వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రిస్క్ ఉండదు. అయితే వీటిని ఆన్‌లైన్ విధానంలో తీసుకోవాలంటే ఎలా, ఆఫ్‌లైన్ ప్రక్రియలో ఎలా తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


గడువు ఎంతో తెలుసా..

విద్యా రుణం ద్వారా రూ.1 కోటి వరకు కూడా తీసుకోవచ్చు. ఇది విద్యార్థుల కోర్సు, సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు ఇతర వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఒక విద్యార్థికి ఆర్థిక ఒత్తిడిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో, బ్యాంకులు తిరిగి చెల్లింపు (repayment)కి దాదాపు 15 సంవత్సరాల వరకు గడువు అందిస్తాయి. దేశీయంగానే కాదు, విదేశాల్లో చదువులకు కూడా లోన్స్ అందిస్తాయి బ్యాంకులు. ఇండియాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు లేదా Harvard, Stanford లాంటి విదేశీ సంస్థల కోసం కూడా ఈ రుణాన్ని పొందవచ్చు.


విద్యా రుణాల రకాలు

  • విద్యా అవసరాలకు అనుగుణంగా, బ్యాంకులు కొన్ని విభిన్న రకాల లోన్లు అందిస్తున్నాయి:

  • అండర్ గ్రాడ్యుయేట్ లోన్ దీనిలో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కోర్సులకు

పోస్ట్ గ్రాడ్యుయేట్ లోన్

  • డిగ్రీ తర్వాత మాస్టర్స్ లేదా స్పెషలైజ్డ్ కోర్సులకు

వృత్తిపరమైన అడ్వాన్స్‌మెంట్ లోన్

  • నైపుణ్య అభివృద్ధి (skill development), డిప్లొమా, శిక్షణ కోర్సులకు

తల్లిదండ్రుల లోన్

  • తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం రుణాన్ని తీసుకోవచ్చు


ఆన్‌లైన్‌లో విద్యా రుణం ఎలా అప్లై చేయాలి

  • మీరు ఎంచుకున్న బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

  • “విద్యా రుణం / Education Loan” అనే విభాగాన్ని క్లిక్ చేయండి

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను అన్ని వివరాలతో నింపండి

  • పేరు, కోర్సు పేరు, కాలేజీ పేరు, శిక్షణా వ్యవధి మొదలైనవి

  • అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి

  • గుర్తింపు పత్రం (ఆధార్, పాన్)

  • చిరునామా రుజువు

  • విద్యా ధృవీకరణ పత్రాలు

  • అడ్మిషన్ లెటర్

  • ఆదాయ ధృవీకరణ (ఐటీఆర్, సాలరీ స్లిప్)

  • సమర్పించిన తర్వాత, బ్యాంక్ అధికారుల బృందం ధృవీకరణ చేస్తుంది

  • అంగీకరించిన తర్వాత మీ ఖాతాకు రుణం విడుదల చేయబడుతుంది

మహిళలకు, బ్యాంకు ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రాయితీలు అందిస్తారు. వడ్డీ రేటులో కొన్ని బ్యాంకులు ప్రత్యేక తగ్గింపులు ఇస్తాయి, ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు. మీ కోర్సు పూర్తయ్యాక తక్షణమే EMIలు మొదలవ్వవు. ఒక సంవత్సరం లేదా ఉద్యోగం దొరికేంతవరకు గడువు ఇస్తాయి. దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు.


ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి

  • వ్యక్తిగతంగా బ్యాంకుకు వెళ్లడం మంచిది

  • మీకు నచ్చిన లేదా సమీప బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లండి

  • లోన్ ఆఫీసర్‌ను కలవండి, విద్యా రుణం గురించి వివరాలు అడగండి

  • అప్లికేషన్ ఫారమ్‌ను తీసుకుని, అవసరమైన సమాచారంతో నింపండి

  • మీ డాక్యుమెంట్స్ (గుర్తింపు పత్రాలు, అడ్మిషన్ లెటర్ మొదలైనవి) ఇవ్వండి

  • ఫారమ్, ఇతర పత్రాలను సమర్పించండి. ధృవీకరణ తర్వాత రుణం మంజూరు అవుతుంది

  • అవసరమైన డాక్యుమెంట్స్ జాబితా

  • ఇవి సాధారణంగా అన్ని బ్యాంకులు అడిగే పత్రాలు:

  • విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

  • గుర్తింపు పత్రాలు (ఆధార్, పాన్ కార్డు)

  • చిరునామా ధృవీకరణ

  • విద్యా సంబంధిత ధృవీకరణలు (10వ, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు)

  • ప్రవేశ (అడ్మిషన్) లెటర్

  • కోర్సు ఫీజు స్ట్రక్చర్

  • తల్లిదండ్రుల ఆదాయ రుజువు/గ్యారంటీ పత్రాలు

  • బ్యాంక్ స్టేట్‌మెంట్స్


చిట్కాలు & సూచనలు

  • బ్యాంక్ వడ్డీ రేట్లను పోల్చుకుని ఆప్షన్లు పరిశీలించండి

  • గ్రేస్ పీరియడ్, చెల్లింపు షెడ్యూల్ గురించి ముందే ప్లాన్ చేసుకోండి

  • ప్రభుత్వ స్కాలర్షిప్‌లు, విద్యా రుణ సబ్సిడీలు ఉన్నాయేమో తెలుసుకోండి

  • అవసరమైనంత రుణం మాత్రమే తీసుకోండి. భవిష్యత్తులో ఇది తిరిగి చెల్లించాల్సిందేనని గుర్తుంచుకోండి


ఇవి కూడా చదవండి:

Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 20 , 2025 | 07:25 PM