Viral Video: కర్ణాటకలో కూడా హిందీ భాష వివాదం.. స్పందించిన సీఎం
ABN , Publish Date - May 21 , 2025 | 01:59 PM
ఇటీవల తమిళనాడులో హిందీ భాష వివాదం గురించి విన్నాం. కానీ ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కూడా అలాంటి వివాదం వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటక చందాపురలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో ఒక కస్టమర్, బ్యాంక్ మేనేజర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ క్రమంలో కన్నడ భాష వాడకంపై ఇద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్నడ భాష పట్ల గౌరవం, రాష్ట్ర గుర్తింపు గురించి మరోసారి చర్చకు తెరలేపింది.
ఈ సంఘటన బెంగళూరు దక్షిణ శివారులోని చందాపురలోని SBI బ్రాంచ్‌లో జరిగింది. ఒక కస్టమర్ బ్యాంక్ మేనేజర్‌తో కన్నడలో మాట్లాడాలని కోరాడు, ఎందుకంటే కర్ణాటకలో కన్నడ రాష్ట్ర భాషగా ఉంది. అయితే, బ్యాంక్ మేనేజర్ ఈ అభ్యర్థనను తిరస్కరించి, కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించింది. ఈ సంభాషణ వీడియోలో రికార్డ్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో వారి సంభాషణ ఇలా కొనసాగింది:
కస్టమర్: ఇది కర్ణాటక, మేడమ్
బ్యాంక్ మేనేజర్: అయితే? ఇది భారతదేశం
కస్టమర్: ఇక్కడ కన్నడ ఫస్ట్ మేడమ్
బ్యాంక్ మేనేజర్: మీ కోసం నేను కన్నడ మాట్లాడను
కస్టమర్ ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా, బ్యాంక్ అధికారితో కన్నడలోనే మాట్లాడాలని పట్టుబట్టాడు.
కస్టమర్: మీరు ఎప్పటికీ కన్నడ మాట్లాడరా?
బ్యాంక్ మేనేజర్: లేదు.నేను హిందీ మాట్లాడతాను
బ్యాంక్ మేనేజర్: హిందీ
కస్టమర్: కన్నడ
బ్యాంక్ మేనేజర్: హిందీ
కస్టమర్: కన్నడ
ఈ సంభాషణ కొన్ని నిమిషాల పాటు అలాగే కొనసాగింది. ఇద్దరూ తమ వాదనలో వెనక్కి తగ్గలేదు. కస్టమర్ తన వాదనను బలపరుస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు.
కస్టమర్: మేడమ్, ఇది కర్ణాటక. మీరు కన్నడ మాట్లాడాలి. RBI రూల్ ప్రకారం ఆయా రాష్ట్రంలో సంబంధిత స్థానిక భాష మాట్లాడాలి
అయినప్పటికీ, బ్యాంక్ మేనేజర్ తన నిర్ణయంలో అలాగే ఉంది.
బ్యాంక్ మేనేజర్: నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను.
దీనికి కస్టమర్ వ్యంగ్యంగా స్పందిస్తూ “సూపర్, మేడమ్, సూపర్!” అని అన్నాడు. దీనిని రికార్డ్ చేసిన కస్టమర్, ఈ బ్యాంక్ బ్రాంచ్‌కు గుణపాఠం చెప్పాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి ప్రజలకు సూచించాడు. ఈ సంఘటన తర్వాత, కన్నడ అనుకూల సంస్థలు ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. ఈ ఘటనను నిరసిస్తూ, వారు రేపు ఒక నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. SBI ప్రధాన బ్రాంచ్‌కు ఊరేగింపుగా వెళ్లి, ఈ విషయంపై ఒక మెమోరాండం సమర్పించాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో
RBI నిబంధనల ప్రకారం, బ్యాంక్ అధికారులు స్థానిక భాషలో సేవలు అందించాలని సూచించినప్పటికీ బ్యాంక్ మేనేజర్ పాటించక పోవడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అనేక మంది కూడా కస్టమర్ చెప్పిన విధానాన్ని సమర్థిస్తున్నారు. అంతేకాదు ఈ అంశం కర్ణాటక సీఎం కూడా స్పందించారు. బ్యాంకు ఉద్యోగులు కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషను మాట్లాడే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ సంఘటనపై SBI బ్యాంక్ కూడా స్పందించింది. ఆ బ్యాంక్ మేనేజర్‌ను తాత్కాలికంగా బదిలీ చేశారు. ఆమె ఈ సంఘటనపై వీడియో ద్వారా క్షమాపణలు కూడా చెప్పారు.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి