Share News

Vodafone Idea Free Days: ఈ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 24 రోజుల రీఛార్జ్ పొడిగింపు ఫ్రీ..

ABN , Publish Date - Jul 10 , 2025 | 06:30 PM

ప్రస్తుతం భారత టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (Vodafone Idea Free Days) సరికొత్తగా ముందుకొచ్చింది.

Vodafone Idea Free Days: ఈ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 24 రోజుల రీఛార్జ్ పొడిగింపు ఫ్రీ..
Vodafone Idea Free Days

దేశంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు పోటాపోటీ ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) తన వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇది ప్రధానంగా 2G, 4G, 5G వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా Vi కస్టమర్లకు ఉచితంగా అదనపు రీఛార్జ్ చెల్లుబాటు రోజులను, అధిక డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు Vi గ్యారెంటీ ప్రోగ్రామ్‎లో భాగంగా రూపొందించబడ్డాయి.


24 రోజుల ఉచిత చెల్లుబాటు

Vi తన 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం, కస్టమర్లు కనీసం రూ. 199 విలువైన అపరిమిత వాయిస్ కాలింగ్ రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకుంటే, ప్రతి నెలా 2 రోజుల అదనపు చెల్లుబాటును ఉచితంగా పొందవచ్చు. అంటే, సంవత్సరంలో మొత్తం 12 నెలలకు 24 రోజులు అదనపు చెల్లుబాటు లభిస్తుంది. ఈ 24 రోజులు ఒకేసారి కాకుండా, ప్రతి నెలా 2 రోజుల చొప్పున ఫ్రీగా వస్తుంది. సాధారణంగా 28 రోజుల చెల్లుబాటు ఉన్న రీఛార్జ్ ప్యాక్ ఇప్పుడు 30 రోజుల వరకు చెల్లుతుంది.


4G, 5G వినియోగదారులకు అదనపు డేటా

వీఐ తన 4G, 5G వినియోగదారుల కోసం కూడా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం కనీసం రూ. 299 రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు సంవత్సరంలో 130GB అదనపు డేటాను పొందవచ్చు. ఈ డేటా 28 రోజులకు ఒకసారి 10GB చొప్పున, సంవత్సరంలో 13 సార్లు అందిస్తారు. డేటాను ఎక్కువగా వినియోగించే కస్టమర్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అదనపు డేటా వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, సోషల్ మీడియా వంటి అవసరాల కోసం ఉపయోగపడుతుంది.


సౌలభ్యం కోసం

వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్ అనేది వినియోగదారులకు రీఛార్జ్ భారాన్ని తగ్గించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక ప్లాన్. సాధారణంగా, ప్రీపెయిడ్ వినియోగదారులు నెలవారీ రీఛార్జ్ చేసుకుంటారు. ఇది కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమస్యను గుర్తించిన వీఐ, తన కస్టమర్లకు అదనపు చెల్లుబాటు రోజులు, డేటా ఆఫర్‌లను అందిస్తోంది. భారతదేశంలో ఇప్పటికీ 2G ఫోన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్ల ద్వారా వీఐ కస్టమర్ బేస్ పెంచుకోవాలని చూస్తోంది.


ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 06:33 PM