ITR Filing 2025: పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్.. ఈ మినహాయింపులు మర్చిపోకండి
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:04 PM
పాత పన్ను విధానాన్ని స్వీకరించిన (Old Tax Regime) వారికి అనేక లాభాలు ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోకపోతే మీరే నష్టపోయే అవకాశం (ITR Filing 2025) ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకునే వారికి కీలక అలర్ట్. ఎందుకంటే దీని విషయంలో మీ ఆదాయాన్ని తగ్గించుకునేందుకు (ITR Filing 2025) అనేక మినహాయింపులు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మీ పన్ను మొత్తాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు. అయితే వీటిలో ఎలాంటి అంశాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన నిబంధన
ఒక ఆర్థిక సంవత్సరం (Financial Year) లో చేసిన పెట్టుబడులు లేదా ఖర్చులకే మినహాయింపు లభిస్తుంది. అయితే ఒకసారి మీరు మినహాయింపును మర్చిపోతే మాత్రం తర్వాత ఏళ్లలో దానిని క్లెయిమ్ చేసుకోలేరు. ఇటీవల ఐటీఆర్ దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పొడిగించింది.
ఆరోగ్య బీమా ప్రీమియం- సెక్షన్ 80D
60 సంవత్సరాల లోపు వ్యక్తుల తమ జీవిత భాగస్వామిపై ఆధారపడిన పిల్లల కోసం చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25,000 వరకు మినహాయింపును పొందవచ్చు. తల్లిదండ్రుల వయస్సు 60 కన్నా తక్కువ అయితే అదనంగా రూ.25,000 మినహాయింపు ఉంటుంది. వారు 60 కన్నా ఎక్కువ అయితే రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ మొత్తం ప్రీమియం మినహాయింపులో భాగంగా రూ.5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా లేకుండా ఉన్న సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల మెడికల్ ఖర్చుల విషయంలో రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగి భవిష్యనిధి (EPF)
ఉద్యోగి తన EPF, VPF కంట్రిబ్యూషన్లపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. FY 2021-22 నుంచి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ EPF+VPF కంట్రిబ్యూషన్లపై వచ్చిన వడ్డీ పన్ను ఉంటుంది. సంస్థ ఇచ్చే EPF, NPS, సూపరాన్యుయేషన్ ఫండ్ కలిపి రూ.7.5 లక్షల కంటే ఎక్కువ అయితే ఆ అదనపు వడ్డీ కూడా పన్నుకి లోబడి ఉండాలి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సెక్షన్ 80C
దీనిలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం టాక్స్ ఫ్రీ. 15 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ వరకు ఉంటుంది.
ELSS మ్యూచువల్ ఫండ్స్ – సెక్షన్ 80C
3 సంవత్సరాల లాక్-ఇన్ గల ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)లో పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. మీరు ఏ సంవత్సరంలో పెట్టుబడి చేస్తే ఆ సంవత్సరానికే మినహాయింపు లభిస్తుంది.
ఆదాయంపై వడ్డీ మినహాయింపులు – సెక్షన్ 80TTA, 80TTB
60 సంవత్సరాల లోపు వ్యక్తులు సేవింగ్స్ అకౌంట్లపై వచ్చిన వడ్డీపై రూ.10,000 వరకు మినహాయింపు (80TTA) ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్లు, FDలు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై వడ్డీపై రూ.50,000 వరకు మినహాయింపు (80TTB) లభిస్తుంది. ఒకే సంవత్సరం లోపు మీరు 80TTA లేదా 80TTBలో ఒక దానిని మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మినహాయింపులు నివాసితులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ NRIలకు వర్తించవు.
హోం లోన్‌పై మినహాయింపులు
వడ్డీ చెల్లింపుపై: సెక్షన్ 24(b) క్రింద రూ.2 లక్షల వరకు మినహాయింపు
ప్రిన్సిపల్ చెల్లింపుపై: సెక్షన్ 80C క్రింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు
ఈ మినహాయింపులు పొందాలంటే మీ పేరుతో ఆస్తి ఉండాలి. రుణాన్ని హౌస్ కొనుగోలుకే వినియోగించాలి
మినహాయింపులు ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు
మీరు మీ సొంత ఆదాయం ద్వారా చేసిన పెట్టుబడులపై మాత్రమే మినహాయింపులు పొందవచ్చు
భార్య, పిల్లల పేరుపై పెట్టుబడి చేస్తే, మీరు మినహాయింపు క్లెయిమ్ పొందలేరు
ఉమ్మడి హోం లోన్ లేదా పాలసీ తీసుకుంటే, ఇద్దరూ తమ వాటా మేరకు మినహాయింపు పొందవచ్చు
మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడానికి సూచనలు
అన్ని రసీదులు, బిల్లులు జాగ్రత్తగా భద్రపరచుకోండి. రిటర్న్ దాఖలులో అవసరమవుతుంది.
ITR ఫారమ్ లో సరిగ్గా వివరాలు నమోదు చేయండి
ఎందుకంటే ఒకసారి మర్చిపోయిన మినహాయింపును తరువాతి సంవత్సరంలో క్లెయిమ్ చేయడం కుదరదు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి