Gold Rates Today: గుడ్ న్యూస్..అక్షయ తృతీయకు ముందే తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Apr 28 , 2025 | 06:23 AM
అక్షయ తృతీయ పండుగకు ముందే బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వీటి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత క్రమంగా మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 28న) గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గి (gold rates today) రూ. 98,200 స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,010గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,300 స్థాయిలో ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,160గా కలదు.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరోవైపు ఈరోజు కేజీ వెండి ధర కిలోకు 100 రూపాయలు తగ్గి్పోయి, హైదరాబాద్‌లో రూ. 111,800గా ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.101,800 కాగా, చెన్నైలో రూ. 111,800, పూణేలో రూ.101,800, బెంగళూరులో రూ.101,800గా ఉంది. మార్కెట్లు మొదలైన తర్వాత వీటి ధరలు మళ్లీ మారే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పటికే లక్ష రూపాయలకు చేరుకున్న పసిడి ధరలు అక్షయ తృతీయ పండుగ రోజు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని పలువురు చెబుతుండగా, తగ్గుతాయని మరికొంత మంది అంటున్నారు.
పసిడి స్వచ్ఛత ఎలా తెలుసుకోవాలి..
బంగారం స్వచ్ఛతను అంచనా వేయడంలో ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కు ఒక ప్రధాన సూచికగా ఉంటుంది. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనదిగా గుర్తించబడుతుంది. అంటే ఇందులో ఎలాంటి కల్తీ లేకుండా శుద్ధ బంగారం ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91% స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో 9% ఇతర లోహాలు కలిపి బంగారం తయారు చేస్తారు. ఇది రాగి, వెండి, జింక్ వంటి లోహాలను కలిపి ఆభరణాలను రూపొందించేందుకు ఉపయోగిస్తారు.
మార్కెట్లో ఉన్న డిమాండ్
ప్రతీ క్యారెట్ బంగారంపై ప్రత్యేకమైన హాల్ మార్కు ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అనే సంఖ్యలు ఉంటాయి. ఈ హాల్ మార్కుల ద్వారా మీరు బంగారం స్వచ్ఛతను సులభంగా అంచనా వేసుకోవచ్చు. అమెరికా డాలర్ విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్, వాణిజ్య యుద్ధం వంటి పరిస్థితుల నేపథ్యంలో వీటి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News