Gold Rates Today: ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..ఈ వారం లక్షకు చేరుతుందా..
ABN , Publish Date - Apr 21 , 2025 | 06:31 AM
ఈరోజు (ఏప్రిల్ 21న) బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ముందుగా తాజా ధరలను తెలుసుకుని వెళ్లండి మరి. ఎందుకంటే వీటి ధరలు దాదాపు లక్షకు దగ్గరకు చేరుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేశంలో బంగారం, వెండి ధరలు (gold rates) గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (ఏప్రిల్ 21న) గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి మరి. సోమవారం ఉదయం 6.30 గంటల నాటికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర (gold rates today) రూ. 97,570 ఉండగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 89,440గా ఉంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 97,720 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,590గా కలదు.
నేటి వెండి రేట్లు
మరోవైపు ఈరోజు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 109,900గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.99,900 కాగా, చెన్నైలో రూ. 109,900, పూణేలో రూ.99,900, బెంగళూరులో రూ.99,900గా కలదు. మార్కెట్లు మొదలైన తర్వాత వీటి ధరలు మళ్లీ మారే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వారం పసిడి ధరలు లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్ విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వీటి రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
బంగారం స్వచ్ఛమైనదా కాదా, ఇలా చెక్ చేయండి
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతను కలిగి ఉండాలి (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి కల్తీ ఉండదు.
ఇవి కూడా చదవండి:
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News