Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - May 28 , 2025 | 06:34 AM
దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి వేళ పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గిపోయాయి. ఆభరణాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక వెండి ధర కూడా నిన్నటి పెరుగుదల తర్వాత మళ్లీ తగ్గడం విశేషం.

దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. బంగారం ధరలు (gold rates) వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన వెండి ధరలు (silver rates today) కూడా ఈరోజు తగ్గాయి. నేడు (మే 28న) మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళితే మాత్రం ముందుగా తాజా ధరలను తెలుసుకుని వెళ్లండి.
ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు (gold rates today may 28th 2025) ఉదయం 6.40 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.160 తగ్గిపోయి రూ.97,470కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.160 పడిపోయి రూ. 89,340కి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.160 తగ్గి రూ.97,620కి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.89,490గా ఉంది.
వెండి ధరల్లో మార్పు
ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గిపోయి రూ.99,900కు చేరుకుంది. ముంబై, బెంగళూరు, పూణే, లక్నో, పాట్నా, సూరత్, అయోధ్య ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడలో కూడా కేజీ వెండి రేటు 200 రూపాయలు పడిపోయి రూ.110,900కి చేరింది. కానీ చెన్నై, మధురై, పాండిచ్చేరి, త్రివేండ్రం ప్రాంతాల్లో మాత్రం వెండి ధరలు రూ.100 పెరిగి రూ.111,200 స్థాయికి చేరుకున్నాయి.
బంగారం స్వచ్ఛమైనదా కాదా అని ఎలా తెలుసుకుంటారు
బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి భారతదేశంలో ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్‌మార్క్ గుర్తులను ఉపయోగిస్తారు. దీని ప్రకారం 24 క్యారెట్ బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ బంగారంలో 91% బంగారం, మిగిలిన 9% రాగి, వెండి, జింక్ వంటి లోహాలు కలుస్తాయి.
బంగారంపై హాల్‌మార్క్ గుర్తులు దాని స్వచ్ఛతను తెలియజేస్తాయి.
24 క్యారెట్: 999
23 క్యారెట్: 958
22 క్యారెట్: 916
21 క్యారెట్: 875
18 క్యారెట్: 750
24 క్యారెట్ బంగారం పూర్తిగా స్వచ్ఛమైనది. కానీ ఇది చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి ఆభరణాల తయారీకి అనువైనది కాదు. అందుకే చాలా షాపుల్లో 18, 20, లేదా 22 క్యారెట్ బంగార ఆభరణాలు ఎక్కువగా కనిపిస్తాయి. గోల్డ్ స్వచ్ఛత తెలుసుకోవడానికి ఆభరణంపై హాల్‌మార్క్ గుర్తు ఉందో లేదో చూడండి, లేదా ఇతర జ్యూయలరీ షాపులో వాటిని పరీక్షించుకోండి.
ఇవీ చదవండి:
టీసీఎస్ ఏఐ.క్లౌడ్ వ్యాపార విభజన
సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి