Share News

Gold Market: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. 4 నెలల్లోనే బంపర్ జంప్..

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:21 PM

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పసిడికి అనుకూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు పైపైకి చేరుతున్నాయి. కానీ తగ్గడం లేదు. అంతేకాదు ఇప్పటివరకు గత నాలుగు నెలల్లోనే పసిడి ఏకంగా 25 శాతం పెరగడం విశేషం.

Gold Market: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. 4 నెలల్లోనే బంపర్ జంప్..
Gold Prices Surge

బంగారం ధరలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శనను కనబర్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో బంగారం 25 శాతం పెరుగగా, MCX, COMEX మార్కెట్లలో సరికొత్త గరిష్ట స్థాయిలను చేరుకుంది. అదే సమయంలో వెండి కూడా COMEXలో 15 శాతం లాభాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్రమాదాలు, అమెరికా, చైనా మధ్య వ్యాపార ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన గోల్డ్ పెట్టుబడులపై ఆసక్తి చూపించారు. దీంతో పసిడి రేట్లు పైపైకి చేరాయి.


బంగారానికి సానుకూల దృష్టి

టెక్నికల్ స్దాయిల ప్రకారం, MCXలో బంగారం ధర రూ. 91,000 (10 గ్రాముల కోసం) ఉండగా, రూ. 99,000 వద్ద ప్రతిఘటన స్థాయిలు ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. COMEXలో ముఖ్యమైన స్థాయిలు USD 3,100, USD 3,400 ఉండగా, ఈ స్థాయిలు సాధారణ స్థితిలో ఉండే అవకాశమున్నట్లు తెలిపారు. బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వ్యాపార ఉద్రిక్తతలు, మదుపరుల అవసరాలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు.


రక్షణ కోసం బంగారం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, మాంద్యం భయాందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అనేక మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. విభిన్న వ్యాపార సవాళ్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అనిశ్చితమైన రాజకీయ పరిస్థితుల మధ్య, బంగారం ధరలు పైపైకి చేరుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు తమ రిజర్వులను పెంచుతుండగా, పెట్టుబడిదారులు సురక్షిత వనరుల కోసం బంగారాన్ని ఎంచుకుంటున్నారు.


పెట్టుబడుల వైపు దృష్టి

ఈ సంవత్సరంలో బంగారం ధరలతోపాటు వెండి రేట్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలల్లో బంగారం కంటే వెండి ధరలు ఎక్కువగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అధిక టారిఫ్‌ల గురించి చేసిన ఇటీవల వ్యాఖ్యలు, బంగారాన్ని తగ్గేలా చేశాయి. కానీ ఆ తర్వాత త్వరగా తిరిగి పుంజుకున్నాయి. అమెరికా, చైనా వ్యాపార విధానాలు, అదుపులో ఉంచిన వృద్ధి పరిస్థితులు సహా అనేక అంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అనుమానాలను మరింతగా పెంచాయి. ఇలాంటి పరిస్థితుల వేళ అమెరికా డాలర్ ఏడు శాతం తగ్గింది. Federal Reserve ఆర్థిక విధానాలు కూడా మార్కెట్ విధానాలను ప్రభావితం చేశాయి.


ఇవి కూడా చదవండి:

Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 20 , 2025 | 07:54 PM