Gold Prices Today: సరికొత్త రికార్డు స్థాయికి బంగారం ధరలు..లక్షను దాటేసింది తెలుసా
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:25 AM
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలను దాటేసింది. అయితే ఎందుకు పెరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 22న) 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.1,01,350కి చేరుకుంది. ఇది భారతదేశ చరిత్రలో మొదటిసారిగా బంగారం ధర రూ.1 లక్ష దాటడమని చెప్పవచ్చు. బులియన్ మార్కెట్‌లో ఇది కీలకమైన ఘనతగా నిలిచింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,750 పెరిగి రూ.92,900కి, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,250 పెరిగి రూ.76,010కి చేరుకుంది.
రికార్డు స్థాయికి
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $3,400 దాటి, రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ధరల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు గుప్పించడంతో US డాలర్ ఇండెక్స్ 98.09కి పడిపోయింది. దీంతో ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అలాగే, US-చైనా వాణిజ్య చర్చల్లో అనిశ్చితి, సుంకాల ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించాయి. దీంతో పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ధరలు
MCXలో జూన్ 5, 2025 గడువుతో ఉన్న బంగారం ఫ్యూచర్లు 1.72% పెరిగి రూ.98,955 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అలాగే, మే 5, 2025 గడువుతో వెండి ఫ్యూచర్లు 0.63% పెరిగి రూ.95,844కి చేరాయి. నిపుణుల అంచనా ప్రకారం, బంగారం ధరలు రూ.98,500 స్థాయిలో ఉండగా, వెండి ధరలు రూ.98,400 వైపు కదులుతున్నాయి.
వెండి ధరలు
మరోవైపు భారత మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, వెండి రేట్లు మాత్రం స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,000కు పైగా ఉండగా, వెండి ధర కూడా అందుకు ఏమాత్రం తీసిపోకుండా 1 కిలోకి రూ. 1,01,000గా ఉంది. ఈ క్రమంలో చెన్నై, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.7,000 పెరిగి రూ.9,29,000కి చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.98,350గా ఉంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి, 1 కిలో వెండి రూ.1,01,000, 100 గ్రాముల వెండి రూ.10,100గా ఉంది.
ఇవి కూడా చదవండి:
Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News