Gold Silver Rates Today: రూ.5 వేలు పెరిగిన బంగారం..గోల్డ్‌ను బీట్ చేసిన వెండి
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:49 AM
దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్న వేళ, ఈరోజు కాస్త ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో ఈ రేట్లు ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా పైపైకి చేరిన బంగారం, వెండి ధరలకు కాస్తా బ్రేక్ పడింది. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 13న) బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,700గా ఉంది. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95,820గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,850 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పసిడి ధర గత వారం రోజుల్లో రూ.5010 పెరగడం విశేషం.
వెండి ధరలు కూడా..
ఇదే గోల్డ్ రేట్లు ఏప్రిల్ 6న 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.90,660గా ఉండగా, ప్రస్తుతం ఏప్రిల్ 13న రూ.95,670 కలదు. అంటే వారం రోజుల్లో 5 వేల రూపాయలకుపైగా పుంజుకుంది. మరోవైపు ఇదే సమయంలో ఏప్రిల్ 6న వెండి ధరలు హైదరాబాద్, విజయవాడలో రూ. 1,03,000 ఉండగా, ప్రస్తుతం రూ.1,10,000కి చేరుకున్నాయి. అంటే సిల్వర్ కూడా బంగారం కంటే ఎక్కువగా 7 వేల రూపాయలు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో వీటిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు ఈ వారంలో మంచి లాభాలను దక్కించుకున్నారు.
ఎందుకు పెరుగుతున్నాయ్
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్‌తో రూపాయి మారకం విలువ, గణనీయమైన డిమాండ్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు కలిసొచ్చి బంగారం ధరలను మరింత పెంచుతున్నాయి. వారంలోనే ఈ ధరలు ఏకంగా రూ. 5,010 పెరగడం అంటే నిజంగా పెద్ద విషయమని చెప్పవచ్చు ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఈ టైంలో బంగారం ధరలు పెరగడం సామాన్య ప్రజలకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. డిమాండ్ పెరగడంతో వీటి ధరలూ ఇకా పెరుగుతున్నాయి. వీటి ధరలు ఇంకా పైకి వెళ్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
కొనాలా వద్దా..
బంగారం ధరలు గడచిన వారం రోజుల్లో చూపిన ఈ ఉత్సాహం చూస్తుంటే, ఇది ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో వీటిపై పెట్టుబడులు చేసే ముందు విశ్లేషణ, మార్కెట్ పరిస్థితుల గురించి తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమ. ఇలాంటివి చూసి ఒక్కసారిగా ఎగబడి బంగారం కొంటే, మళ్లీ తగ్గితే నష్టపోతారు. అందుకే విశ్లేషించి నిర్ణయించుకోవడం మేలు.
ఇవి కూడా చదవండి:
Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Read More Business News and Latest Telugu New