Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
ABN , Publish Date - May 24 , 2025 | 06:34 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు (gold rates today may 24th 2025) ఉదయం నాటికి భారీగా తగ్గిపోయాయి. అయితే ఏ మేరకు తగ్గాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు (gold rates today may 24th 2025) ఉదయం నాటికి వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 400 తగ్గి రూ. 97,520కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 520 తగ్గి రూ. 89,390కి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 97,670 స్థాయికి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,540కు చేరింది. దీంతో నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు.
ఈరోజు వెండి రేట్లు ఇలా..
ఇదే సమయంలో వెండి రేట్లు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1100 తగ్గిపోయి రూ.99,900కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడ, వరంగల్, తిరుపతిలో వెండి రేటు రూ.1200 తగ్గిపోయి రూ.110,900కి చేరింది. మరోవైపు కేరళ, చెన్నై ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ.110,900 స్థాయికి చేరుకున్నాయి. ముంబై, నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్ ప్రాంతాల్లో వెండి రేట్లు కిలోకు రూ. 99,900గా కలవు.
బంగారం ధరల తగ్గుదలకు కారణాలు
బంగారం ధరల తగ్గుదలకు అనేక కారణాలు దోహదపడ్డాయి. ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం, డాలర్ విలువలో మార్పులు, భారతదేశంలో బంగారం డిమాండ్లో సీజన్ మార్పులు ఈ ధరల తగ్గుదలకు కారణాలుగా ఉన్నాయి. అంతేకాదు దేశీయ బంగారం ధరలు అంతర్జాతీయ ధరలతో పాటు దిగుమతి సుంకాలు, స్థానిక పన్నులు, బులియన్ అసోసియేషన్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం చైనా తర్వాత, భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. ఇండియాలో అనేక మంది కూడా బంగారం కొనుగోలును సంప్రదాయంగా భావిస్తారు.
24 క్యారెట్ vs 22 క్యారెట్ తేడా ఏంటి
24 క్యారెట్ బంగారాన్ని 99.9% స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. ఇది పెట్టుబడి లేదా బంగారు నాణేలు, బిస్కెట్ వంటి రూపాల్లో ఉంటుంది. ఇది మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీకి తక్కువగా ఉపయోగిస్తారు. 22 క్యారెట్ బంగారం 91.6% స్వచ్ఛమైన బంగారంతో ఉంటుంది. దీనిలో రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. 24 క్యారెట్ బంగారం ధర ఎల్లప్పుడూ 22 క్యారెట్ కంటే ఎక్కువ, కాబట్టి దీని అత్యధిక స్వచ్ఛత నేపథ్యంలో ధర కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇవీ చదవండి:
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి