Share News

Deloitte Consultant to Kunal Shah: క్రెడ్ నష్టాల్లో ఉందా.. డెలాయిట్ కన్సల్టెంట్ పోస్ట్ వైరల్

ABN , Publish Date - Jul 07 , 2025 | 09:12 PM

ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా గురించి కొత్త చర్చ మొదలైంది. డెలాయిట్ కన్సల్టెంట్ ఆదర్శ్ సమలోపనన్ సోషల్ మీడియాలో (Deloitte Consultant to Kunal Shah) ఓ ప్రశ్నను లేవనెత్తారు. నష్టాలతో ఉన్న కునాల్ స్టార్టప్‌లను ఎందుకు విజయవంతంగా పరిగణిస్తారని, అవి ఒక్క ఏడాది కూడా లాభాలను సాధించలేదన్నారు.

Deloitte Consultant to Kunal Shah: క్రెడ్ నష్టాల్లో ఉందా.. డెలాయిట్ కన్సల్టెంట్ పోస్ట్ వైరల్
Deloitte Consultant to Kunal Shah

ప్రముఖ భారత ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ (CRED) వ్యవస్థాపకుడు కునాల్ షా గురించి.. డెలాయిట్ సీనియర్ కన్సల్టెంట్ ఆదర్శ్ సమలోపనన్ లింక్డ్‌ఇన్‎లో కీలక పోస్ట్ చేశారు. దీని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ పోస్ట్‌లో కునాల్.. ఫ్రీచార్జ్, CRED వంటి సంస్థల నష్టాల గురించి ప్రస్తావించారు. ఆయన అంచనాల ప్రకారం, ఇవి గత 10 సంవత్సరాలుగా లాభాలు అందించడం లేదన్నారు (Deloitte Consultant to Kunal Shah). రూ. 5,200 కోట్ల నష్టాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో కునాల్ షా ప్రయాణం సక్సెస్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

social media.jpg


ఫ్రీచార్జ్, CRED

కునాల్ షా మొదటి కంపెనీ ఫ్రీచార్జ్ 2010లో ప్రారంభమైంది. మొదట్లో, అది ఎంతో విజయం సాధించింది. 2015 నాటికి రూ. 35 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల వల్ల, సంస్థ రూ. 269 కోట్ల నష్టాలు చవిచూసింది. ఆ క్రమంలో ఫ్రీచార్జ్‎ను స్నాప్ డీల్ రూ. 2800 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత రూ. 370 కోట్లకు యాక్సిస్ బ్యాంకుకు సేల్ చేసింది. ఆ తర్వాత కునాల్ షా CRED సంస్థను 2018లో ప్రారంభించారు. ఈ సంస్థ ప్రస్తుతం రూ. 4,493 కోట్ల ఆదాయం సంపాదించగా, రూ. 5,215 కోట్ల నష్టాలతో ఉంది.


కునాల్ షా రియాక్షన్

ఈ పోస్టుపై కునాల్ షా స్పందించారు. మీరు చెప్పినట్లు గత ఏడేళ్లుగా మా కంపెనీ నష్టాల్లోనే ఉన్నట్లు తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారుతుందన్నారు. ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉద్యోగ ప్రపంచాన్ని గణనీయంగా మార్చింది. ప్రస్తుతం ఉద్యోగాలు చేసే వ్యక్తుల నుంచి పలువురు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సృష్టించే వ్యక్తులుగా సొంత ఖర్చు లేకుండా మారుతున్నట్లు చెప్పారు. అలాంటి వారిని గౌరవించడం, వారి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగ ప్రపంచంలో కొత్త అవకాశాలు, సవాళ్లు కూడా వస్తున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేసే వారితో పాటు ఉద్యోగాలు కల్పించేవారు కూడా ముఖ్యమేనని అన్నారు.


ఏమనుకుంటున్నారు..

అయితే దీని గురించి పలువురు ఆదర్శ్ విధానాన్ని సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం కునాల్ షాకు మద్దతు పలుకుతున్నారు. వ్యాపారం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదని అంటున్నారు. Facebook, WhatsApp వంటి ప్రపంచ స్థాయి సంస్థలు కూడా మొదట్లో నష్టాలతోనే కొనసాగాయని గుర్తు చేస్తున్నారు. ఈ సంస్థలు కూడా విజయం సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని చెబుతున్నారు. అయితే ఈ చర్చపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 09:16 PM