Share News

Debt Consolidation vs Loan Restructuring: డెట్ కన్సాలిడేషన్ vs లోన్ రీస్ట్రక్చరింగ్ వీటిలో ఏది మంచిది..

ABN , Publish Date - Jul 04 , 2025 | 09:53 PM

దేశంలో మధ్య తరగతి కుటుంబాలపై రుణభారం క్రమంగా పెరుగుతోంది. నిత్యావసర ఖర్చులు, వేతనాల్లో పెరుగుదల లేకపోవడం, సులభంగా క్రెడిట్ లభించడం వంటి పలు కారణాలతో లక్షలాది మంది ఆర్థిక చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డెట్ కన్సాలిడేషన్ లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ (Debt Consolidation vs Loan Restructuring) ఎంచుకుంటే పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Debt Consolidation vs Loan Restructuring: డెట్ కన్సాలిడేషన్  vs లోన్ రీస్ట్రక్చరింగ్ వీటిలో ఏది మంచిది..
Debt Consolidation vs Loan Restructuring

ప్రస్తుతం భారత్‌లో లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాలు అధిక రుణభారంతో ఇబ్బంది పడుతున్నాయి. ఖర్చులు పెరగడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, క్రెడిట్ సులభంగా లభించడం వంటి అనేక అంశాల వల్ల చాలా మంది నెలకు ఒకటి కంటే ఎక్కువ EMIలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రుణాలను తీర్చలేక డిఫాల్ట్ అవుతున్నారు కూడా.

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ప్రకారం 2024లో క్రెడిట్ కార్డులపై నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) 28 శాతం పెరిగి రూ. 6,742 కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్రధాన ఆర్థిక వ్యూహాలను పాటించడం ద్వారా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒకటి డెట్ కన్సాలిడేషన్ (Debt Consolidation), రెండోది లోన్ రీస్ట్రక్చరింగ్ (Loan Restructuring). ఇవి రెండూ రుణ భారం తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.


డెట్ కన్సాలిడేషన్ అంటే ఏంటి? (Debt Consolidation vs Loan Restructuring)

డెట్ కన్సాలిడేషన్ అనేది మీరు తీసుకున్న వివిధ రకాల రుణాలను ఒకే రుణంగా కలిపుకునే ప్రక్రియ. ఉదాహరణకు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఇతర చిన్న రుణాలు కలిపి ఒక పెద్ద లోన్ తీసుకుని వాటన్నింటినీ క్లియర్ చేస్తారు. తద్వారా మిగతా అన్ని EMIలు తొలగిపోయి ఒక్కటి మాత్రమే ఉండటం వల్ల మీకు గందరగోళం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా తీసుకునే కొత్త లోన్ చాలా సందర్భాల్లో తక్కువ వడ్డీ రేటుతో లేదా ఎక్కువ కాలపరిమితితో ఉంటుంది.


మీ క్రెడిట్ స్కోరు కూడా..

ఇది నెలవారీ చెల్లింపులను తగ్గిస్తుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డు వడ్డీ రేటు వార్షికంగా 30% నుంచి 48% వరకు ఉంటుంది. అయితే పర్సనల్ లోన్ వడ్డీ రేటు 11% నుంచి 22% మధ్య ఉండొచ్చు. కానీ కన్సాలిడేషన్ ద్వారా ఈ అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణంతో బదిలీ చేయడం వల్ల మీరు ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇది ప్రయోజనకరంగా ఉండటానికి మీకు స్థిరమైన ఆదాయం, మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. ఈ పద్ధతిని అనుసరించిన తర్వాత కూడా మీరు డిసిప్లిన్‌తో చెల్లింపులు కొనసాగిస్తే మీ క్రెడిట్ స్కోరు కూడా మెరుగవుతుంది. కానీ, వ్యయ నియంత్రణ లేకుండా మళ్లీ అధిక రుణాలను తీసుకుంటే, మళ్లీ పాత పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది.


లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి?

లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది మీ ప్రస్తుత రుణం చెల్లించలేని పరిస్థితుల్లో, అదే రుణదాత ద్వారా మిమ్మల్ని ఆదుకునే ఓ మార్గం. దీనిలో భాగంగా రుణ కాలవ్యవధిని పెంచడం. వడ్డీ రేటును తగ్గించడం. కొన్ని నెలల పాటు చెల్లింపులు నిలిపివేయడం లేదా కొంత మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి COVID-19 సమయంలో చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది రుణదారులకు మోరేటోరియం లేదా రీస్ట్రక్చరింగ్ అవకాశం ఇచ్చారు.


రీస్ట్రక్చర్ రుణాలు

కన్సాలిడేషన్‌ కంటే ఇది ఒక చివరి దశలో వచ్చే సహాయం. మీరు ఉద్యోగం కోల్పోవడం, ఆదాయం లేకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందులో బ్యాంకు లేదా NBFCలు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి, రుణ నష్టాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కొంత మార్పు చేస్తారు. దీని వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు ఉండొచ్చు. రీస్ట్రక్చర్ చేసిన రుణాలు మీ క్రెడిట్ రిపోర్టులో రికార్డవుతాయి. తద్వారా భవిష్యత్తులో మీరు రుణాలు తీసుకోవాలంటే ప్రభావం పడుతుంది.


ఏది ఎంచుకోవాలి?

  • మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా మీరు ఏ పద్ధతి అనుసరించాలో నిర్ణయించాలి

  • మీరు ఇప్పటికీ EMIలు చెల్లించగలిగే స్థితిలో ఉంటే డెట్ కన్సాలిడేషన్ బెస్ట్ ఆప్షన్. ఇది మీకు సౌలభ్యం కలిగించడంతో పాటు వడ్డీని తగ్గించి మీ డబ్బును ఆదా చేస్తుంది

  • మీరు ఇప్పటికే పేమెంట్లు మిస్ అవుతూ, డిఫాల్ట్ అవబోతున్న పరిస్థితిలో ఉంటే, లోన్ రీస్ట్రక్చరింగ్ మీకు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..సెబీ చర్యలు

కారును అమ్మకుండానే ఇలా లోన్ తీసుకోండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 09:57 PM