Share News

Insurance: మూడు రెట్ల వృద్ధి సాధించిన టాటా ఏఐజీ..

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:12 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.

Insurance: మూడు రెట్ల వృద్ధి సాధించిన టాటా ఏఐజీ..

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది. అలా 82,000 మందికి పైగా ఆరోగ్య బీమా రక్షణను అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరు వంటి నగరాలు, పట్టణాల్లో శాఖలను కలిగి ఉంది. వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్ అనే సరసమైన ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ద్రవ్యోల్బణం 16%కి చేరుకుంది. గత మూడేళ్లలో, క్యాన్సర్ చికిత్స ఖర్చులు 25% పెరిగి సగటు ఖర్చు రూ. 1.6 లక్షలకు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) చికిత్స ఖర్చులు 40% పెరిగి రూ. 1.6 లక్షలకు చేరాయి.


వైద్య ఖర్చులు పెరుగుతున్నాయ్..

ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ ఏజెన్సీ ప్రతీక్ గుప్తా మాట్లాడుతూ... “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి. గత రెండేళ్లలో మా రిటైల్ హెల్త్ మార్కెట్ వాటా 2.1% నుంచి 3.6%కి పెరిగింది. ఇప్పుడు 5% లక్ష్యంగా పెట్టుకున్నాం. మరో 15 వేల మంది పంపిణీ భాగస్వాములను జోడించాలని ప్లాన్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.


ఐపీవోకు కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్..

కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి డీఆర్‌హెచ్‌పీ సమర్పించి, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సన్నాహాలు చేస్తోంది. ప్రమోటర్లుగా కెనరా బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్ (ఆసియా-పసిఫిక్) హోల్డింగ్స్ లిమిటెడ్ ఉన్నాయి.

Updated Date - Apr 29 , 2025 | 10:12 PM