Mobile Numbers: ఒక్క ఫోన్ నంబర్ సిమ్ కార్డుకు రూ. 50 వేలు.. ఎందుకో తెలుసా..
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:35 PM
మీ ఫోన్ నంబర్ చాలా స్పెషల్‌గా ఉండాలని అనుకుంటున్నారా. ఆ నంబర్ కోసం ఖర్చు అయినా పర్వాలేదు, మంచి నంబర్ తీసుకోవాలని భావిస్తున్నారా. అందుకోసం భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL) వీఐపీ/ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ మీకు నచ్చిన ప్రత్యేక నంబర్‌ను ఎంపిక చేసుకుని, కొనుగోలు చేయవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మీరు ఒక ప్రత్యేకమైన మొబైల్ నంబర్ కలిగి ఉండాలని కోరుకుంటున్నారా. అందరి కంటే విభిన్నంగా మీ ఫోన్ నంబర్ ఉండాలని భావిస్తున్నారా, అయితే, ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే భారతదేశంలోని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మీ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం వీఐపీ లేదా ఫ్యాన్సీ మొబైల్ నంబర్లను ఆన్‌లైన్ వేలం ద్వారా అందిస్తోంది. ఈ వేలంలో పాల్గొనడం ద్వారా మీరు మీకు నచ్చిన ప్రత్యేకమైన నంబర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ వేలం కస్టమర్లకు సౌలభ్యాన్ని కల్పించడమే కాకుండా, బీఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని కూడా పెంచే ఒక కీలక నిర్ణయమని చెప్పవచ్చు.
బీఎస్ఎన్ఎల్ వీఐపీ నంబర్ వేలం అంటే ఏంటి
బీఎస్ఎన్ఎల్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన టెలికాం సంస్థలలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమ కస్టమర్లకు ప్రత్యేకమైన మొబైల్ నంబర్లను అందించడానికి ఒక ఆన్‌లైన్ వేలం వేదికను ప్రారంభించింది. ఈ వేలంలో మీరు సాధారణ నంబర్ల నుంచి అత్యంత ప్రత్యేకమైన వీఐపీ నంబర్ల వరకు ఎంచుకోవచ్చు. ఈ నంబర్ల ధర రూ.2,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. ఇది ఆ నంబర్ ప్రత్యేకతపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 99999 లేదా 12345 వంటి సులభంగా గుర్తుంచుకోగలిగే నంబర్లు ఎక్కువ ధరకు వేలం పలికే అవకాశం ఉంటుంది.
వెబ్‌సైట్ ద్వారా..
ఈ వేలం బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జరుగుతుంది. దీనిలో పాల్గొనడం చాలా సులభం. ఇది కస్టమర్లకు తమకు నచ్చిన నంబర్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, బీఎస్ఎన్ఎల్‌కు అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది.
బీఎస్ఎన్ఎల్ వీఐపీ నంబర్ వేలంలో ఎలా పాల్గొనాలంటే
బీఎస్ఎన్ఎల్ వీఐపీ నంబర్ వేలం పోర్టల్‌కు వెళ్లండి
మీ రాష్ట్రం, జోన్‌ను ఎంచుకోండి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారం, ఏ జోన్‌కు చెందిన నంబర్ కావాలో సెలక్ట్ చేసుకోండి.
ఆ క్రమంలో మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నంబర్ల జాబితాను చూపిస్తుంది
అందుబాటులో ఉన్న సాధారణ, ఫ్యాన్సీ నంబర్ల జాబితాను పరిశీలించి, మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోండి
ఆ తర్వాత మీకు నచ్చిన నంబర్‌పై క్లిక్ చేసి, "రిజర్వ్ నంబర్" ఆప్షన్ ఎంచుకోండి
మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి, ఆ క్రమంలో మీకు వచ్చిన అంకెల పిన్ (OTP)ని నమోదు చేయండి. ఈ పిన్ 4 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లండి
ఎంచుకున్న నంబర్‌కు సంబంధించిన ఫీజును చెల్లించండి. ఆ తర్వాత మీ నంబర్ యాక్టివేట్ అవుతుంది
ఈ వేలంలో పాల్గొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను గుర్తుంచుకోవాలి.
ఒకేసారి ఒక నంబర్ మాత్రమే: మీరు ఒకేసారి ఒక వీఐపీ నంబర్‌ను మాత్రమే బుక్ చేయవచ్చు. అనేక నంబర్లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉండదు
మీ మొబైల్ నంబర్‌కు వచ్చే 7-అంకెల పిన్ 4 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ వ్యవధిలో మీరు ఫీజు చెల్లించి నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి
ఈ సేవ బీఎస్ఎన్ఎల్ జీఎస్ఎమ్ (సిమ్ కార్డ్) కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
తక్షణ చెల్లింపు: నంబర్ రిజర్వ్ చేసిన తర్వాత, వెంటనే ఫీజు చెల్లించాలి. ఆలస్యం చేస్తే నంబర్ మరొకరికి వెళ్లిపోవచ్చు
ఇతర టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కూడా ఫ్యాన్సీ నంబర్ సేవలను అందిస్తున్నాయి. కానీ వాటి ప్రక్రియలు బీఎస్ఎన్ఎల్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ ఆన్‌లైన్ వేలం వేదిక ద్వారా ఈజీగా అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News