Share News

Operation Sindoor Recharge: ఆపరేషన్ సిందూర్ రీఛార్జ్ ఆఫర్.. క్యాష్‌బ్యాక్‌‎తోపాటు దేశసేవ..

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:27 PM

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త రీఛార్జ్ (Operation Sindoor Recharge) ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా మీరు రూ.2.5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతోపాటు సైనికులకు కూడా సహాయం చేసే అవకాశం లభిస్తుంది.

Operation Sindoor Recharge: ఆపరేషన్ సిందూర్ రీఛార్జ్ ఆఫర్.. క్యాష్‌బ్యాక్‌‎తోపాటు దేశసేవ..
BSNL Operation Sindoor Recharge

దేశభక్తి, సేవా నాణ్యతను దృష్టిలో ఉంచుకుని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్ల కోసం క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో రూ.1499 రీచార్జ్ ప్లాన్‌ను (Operation Sindoor Recharge) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 2.5% మొత్తాన్ని రక్షణ శాఖకు దానం చేస్తూ, వినియోగదారులకు కూడా 2.5% క్యాష్‌బ్యాక్ అందించడం విశేషం. ఈ ఆఫర్ జూన్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు అద్భుతమైన సేవలను పొందడమే కాదు, దేశ రక్షణ కోసం కూడా తోడ్పడతారు.


రూ.1499 ప్లాన్‌ ప్రయోజనాలు

వాలిడిటీ: 336 రోజులు (సుమారు 11 నెలలు). అదనంగా, ప్రమోషనల్ ఆఫర్‌తో 30 రోజుల ఎక్స్‌ట్రా వాలిడిటీ లభిస్తుంది

వాయిస్ కాల్స్: దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ (నేషనల్ రోమింగ్‌తో సహా)

డేటా: 24GB FUP డేటా. డేటా అయిపోయిన తర్వాత 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉంటుంది

SMS: రోజుకు 100 ఫ్రీ SMSలు


వీరికి మంచి ఛాయిస్

ఈ ప్లాన్ ప్రధానంగా కాలింగ్ SMS సేవలను ఎక్కువగా ఉపయోగించే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు తక్కువ డేటా అవసరమైన వారికి ఇది మంచి ఛాయిస్. దీర్ఘకాలిక వాలిడిటీ కారణంగా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఈ ప్లాన్ రోజువారీగా చూస్తే మాత్రం కేవలం 4.5 రూపాయలకే లభిస్తుంది. నెలకు అయితే రూ.134 అవుతుందని చెప్పుకోవచ్చు.

ఆపరేషన్ సిందూర్ ఆఫర్ స్పెషల్ ఏంటంటే

ఆఫర్ గడువు: ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది

క్యాష్‌బ్యాక్: రీచార్జ్ చేసిన తర్వాత, మీ ఖాతాలో 2.5% క్యాష్‌బ్యాక్ (అంటే రూ.37.48) క్రెడిట్ అవుతుంది

రక్షణ శాఖకు సహాయం: రీచార్జ్ మొత్తంలో 2.5% (రూ.37.48) రక్షణ శాఖకు డొనేట్ చేస్తారు. ఇది సైనికుల సేవలకు గాను గౌరవంగా అందించడం జరుగుతుంది.


ఎలా రీచార్జ్ చేసుకోవాలి

  • BSNL వెబ్‌సైట్ లేదా MyBSNL యాప్ దీనిని కొనుగోలు చేయవచ్చు

  • Recharge లేదా Plan Voucher సెక్షన్లో రూ.1499 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు

  • UPI, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయండి

  • చెల్లింపు పూర్తయిన తర్వాత, క్యాష్‌బ్యాక్ మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది

  • ఈ రీచార్జ్ కోసం మీరు BSNL రిటైల్ అవుట్‌లెట్‌లను కూడా సంప్రదించవచ్చు

రూ.1499 ప్లాన్ దీర్ఘకాలిక వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, SMS సౌకర్యాలతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తుంది. అదే సమయంలో, మీరు దేశ రక్షణకు తోడ్పడే అవకాశం పొందుతారు. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా మీరు సౌకర్యవంతమైన రీచార్జ్ ప్లాన్‌తో పాటు సైనికులకు తోడ్పాటు అందించవచ్చు.


ఇవీ చదవండి:

మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 08:33 PM