Share News

Bank Holidays: జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఈ లిస్ట్ చూశారా..

ABN , Publish Date - Jun 01 , 2025 | 10:21 AM

జూన్ నెల రానే వచ్చేసింది. అయితే ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పనులు ఉన్నాయా. అయితే ఈ వార్త మీ కోసమే. ఈ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకు సెలవులు (Bank Holidays June 2025) ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Bank Holidays: జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఈ లిస్ట్ చూశారా..
Bank Holidays June 2025

మీరు ఈ జూన్ నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని కోసం ప్లాన్ చేస్తున్నారా. అయితే ముందుగా ఈ సెలవుల (Bank Holidays June 2025) గురించి తెలుసుకోండి. లేదంటే హాలిడే ఉన్న సమయంలో బ్యాంకులకు వెలితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం, జూన్ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. వీటిలో రెండో, నాలుగో శనివారం, ఆదివారం కలిసి ఉంటాయి. దీంతోపాటు స్థానిక, జాతీయ పండుగలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బ్యాంకింగ్ సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.


జూన్ 2025లో బ్యాంకు సెలవులు

  • 1 జూన్ (ఆదివారం): వారాంతపు సెలవు

  • 6 జూన్ (శుక్రవారం): బక్రీద్ - కేరళలో బ్యాంకులు బంద్ ఉంటాయి

  • 7 జూన్ (శనివారం): బక్రీద్ - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు, కానీ గుజరాత్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కేరళలో తెరిచి ఉంటాయి

  • 8 జూన్ (ఆదివారం): వారపు సెలవు

  • 11 జూన్ (బుధవారం): సంత్ కబీర్ జయంతి/సాగా దావా - సిక్కిం, మేఘాలయలో బ్యాంకులు మూసివేయబడతాయి

  • 14 జూన్ (శనివారం): రెండో శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే


  • 15 జూన్ (ఆదివారం): వారాంతపు సెలవు

  • 22 జూన్ (ఆదివారం): వారాంతపు సెలవు

  • 27 జూన్ (శుక్రవారం): రథయాత్ర/కాంగ్ - ఒడిశా, మణిపూర్‌లో బ్యాంకులకు హాలిడే

  • 28 జూన్ (శనివారం): నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే

  • 29 జూన్ (ఆదివారం): వారపు సెలవు

  • 30 జూన్ (సోమవారం): రెమ్నా ని (శాంతి దినం) – మిజోరంలో బ్యాంకులకు సెలవు

కొన్ని సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి మీ స్థానిక పండుగలను చూసుకుని బ్యాంకులకు వెళ్లే రోజును నిర్ణయించుకోవడం మంచిది.


బ్యాంకులు బంద్ ఉన్నప్పటికీ..

బ్యాంకు శాఖలు మూసివేయబడినప్పటికీ నెట్ బ్యాంకింగ్, UPI, మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, పాస్‌బుక్ అప్‎డేట్ వంటి సేవలు బ్యాంకు శాఖల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అందువల్ల, ఈ పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం మంచిది.


ఇవీ చదవండి:

నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 10:23 AM