Baal Aadhaar Card: చిన్నారులకు బాల ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేసుకోండి
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:51 AM
ఐదేళ్లలోపు పిల్లల కోసం బాల ఆధార్ ను (Baal Aadhaar Card) కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇక ఈ ఆధార్ కార్డుకు తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్‌తో లింక్ చేయాల్సిఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 9: దేశంలోని ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ఆధార్'ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు ఉంటే నేరపూరితం. ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తప్పవని యూఐడీఏఐ (UIDAI) స్పష్టం చేసింది. ఆధార్ తో అనేక మోసాలను, స్కాంలను అరికట్టడంతో పాటు పలు పథకాలకు అప్లై చేసుకోవడానికి ఇలా ప్రతి ఒక్క అంశంలో ఆధార్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. తొలుత యువతీ యువకులకు ఆధార్ కార్డు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇక పుట్టినప్పటినుంచే చిన్నపిల్లలకు సైతం ఆధార్ కార్డుకు అప్లై చేసుకునేలా చర్యలు తీసుకుంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు చకచకా పిల్లలకు ఆధార్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలోపు పిల్లల కోసం బాల ఆధార్ (Baal Aadhaar Card) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇక ఈ ఆధార్ కార్డుకు తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్‌తో లింక్ చేయాల్సిఉంటుంది. ఈ వయసు వరకు పిల్లల బయోమెట్రిక్ (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్) సరిగా పడవు కాబట్టి, వీరికి ఐదేళ్లవరకు ఎటువంటి బయోమెట్రిక్ లేదు. తర్వాత వేలిముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్‌డేట్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో పిల్లలకు ఆధార్ అవసరం పడుతుంది. అందువల్ల బాల ఆధార్ కార్డు లేదా బ్లూ ఆధార్ తీసుకోవడం మంచిది. బాల ఆధార్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే.. చిన్నారి బర్త్ సర్టిఫికేట్ లేదా ఆస్పత్రి డిశ్చార్జ్ సమరీ డాక్యుమెంట్ ఉండాలి. చిన్నారి ఆధార్‌కు లింక్ చేసేందుకు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డ్ ఉండాలి.
ఆన్‌లైన్ లో ఎలా అప్లై చేయాలి:
బాల ఆధార్ కార్డుకోసం UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ‘My Aadhaar’ లో ‘Book an Appointment’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. మీ నగరాన్ని ఎంచుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయాలి. దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రానికి వెళ్లే తేదీ, సమయం బుక్ చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ రోజున తల్లిదండ్రుల్లో ఒకరు తమ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి ఆధార్ వివరాలు ఇవ్వాలి. చిన్నారి పుట్టిన తేదీ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్‌లు, అప్లికేషన్ ఫారమ్ సమర్పించాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత బాల ఆధార్ మీ ఇంటి చిరునామాకు పోస్టులో వస్తుంది. మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ఉడాయ్ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ విధానంలో ఎలా అప్లై చేయాలి?
దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి అక్కడ ఫారమ్ పూరించాలి. చిన్నారి డాక్యుమెంట్లతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు తమ బయోమెట్రిక్, ఆధార్ వివరాలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఒక Acknowledgment స్లిప్ వస్తుంది. దాంట్లో ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సుమారు 60-90 రోజుల్లో బాల ఆధార్ కార్డ్ మీ చిరునామాకు వచ్చే అవకాశం ఉంది. ఇలా సులువుగా బాల ఆధార్ కార్డును పొందవచ్చు.
ఇవి కూడా చదవండి:
అమ్మమ్మతో నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం..
బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు