Stock Market: వరుసగా రెండో రోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు..ఇవే టాప్ 5 స్టాక్స్
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:11 AM
భారత స్టాక్ మార్కెట్లు తగ్గేదేలే అన్నట్లు కొనసాగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సహా పలు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం పాజిటివ్ ధోరణుల్లోనే దూసుకెళ్తున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పెరిగాయానే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్ నేడు (ఏప్రిల్ 29న) కూడా రెండో రోజు లాభాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, సుంకాల పరంగా ఉన్న అనిశ్చితి వంటివి మార్కెట్లపై ఈరోజు కొంత ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ 167.62 పాయింట్లు (0.21%) పెరిగి 80,385.99 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 50 62.55 పాయింట్ల లాభంతో 24,391.05 వద్ద ప్రారంభమయ్యింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 413 పాయింట్లు పడిపోయింది. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో భారత్ ఎలక్ట్రికల్, ట్రెంట్, రిలయన్స్,లార్సెన్, టాటా మోటార్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఈ రోజు మిశ్రమమైన ట్రెండ్‌ను చూపిస్తున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.5% పెరిగింది, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.8% లాభాన్ని నమోదు చేసింది. ఈ సూచీలు చిన్న, మధ్య తరగతి కంపెనీలకు సంబంధించినవి. వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ కోసం మంచి అవకాశాలను చూడవచ్చు.
PNB హౌసింగ్ ఫైనాన్స్ క్యూ4 ఫలితాలు
మంగళవారం, PNB హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తన క్యూ4 ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ సంస్థ షేరు ధర దాదాపు 10% పెరిగింది. మార్చి 2025 త్రైమాసికంలో రూ.550 కోట్ల నికర లాభం నమోదు చేసి, గత ఏడాది కన్నా 25% వృద్ధి సాధించింది. ఇప్పుడు, PNB హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు BSEలో రూ.1,085.4 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రాథమిక మార్కెట్లలో కూడా అనేక ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. అథర్ ఎనర్జీ IPO (ప్రారంభ రోజున 16% సబ్‌స్క్రైబ్) ఇప్పటికి మంచి స్పందనను పొందింది. ఐవేర్ సప్లైచైన్ సర్వీసెస్ IPO (NSE SME) రెండో రోజులోకి ప్రవేశించడంతోపాటు, అరుణయ ఆర్గానిక్స్ IPO, కెన్రిక్ ఇండస్ట్రీస్ IPO కూడా BSE SMEలో సబ్‌స్క్రిప్షన్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
మార్కెట్‌లో అనిశ్చితి, ఉద్రిక్తత
ఇప్పటికే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కొంతమేర ప్రపంచ సంకేతాల మధ్య మిశ్రమంగా ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, అలాగే వాణిజ్య టారిఫ్ ఉన్న అనిశ్చితి మార్కెట్ మీద ప్రభావం చూపించవచ్చు. అయితే, వాణిజ్య సంబంధాలపై ఎన్నో అనిశ్చితులు ఉన్నప్పటికీ, మార్కెట్ ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. ఈ రోజు మార్కెట్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు అనిశ్చితులను దృష్టిలో పెట్టుకొని, శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Rain Alert: వేడి నుంచి ఉపశమనం..ఈ ప్రాంతాల్లో మే 3 వరకు వర్షాలు..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News