Share News

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:01 PM

ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.


అలాంటి యాపిల్ కంపెనీ తమ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఓ బగ్ కారణంగా కేవలం ఐఫోన్లు మాత్రమే కాదు.. యాపిల్ కంపెనీకి చెందిన పలు ప్రొడెక్టులు హ్యాక్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. యూజర్లు ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్చే‌డేట్ చేయాలని తెలిపింది. ఐఓఎస్ 17.2 కంటే ముందున్న వర్షన్లపై ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ప్రకటించింది.

అత్యాధునికమైన దాడులకు హ్యాకర్లు పాల్పడుతున్నారని తెలిపింది. యాపిల్ ఈ ప్రమాదాన్ని CVE-2025-24201గా గుర్తించింది. యాపిల్ ఐఫోన్స్, ఐపాడ్స్, మాక్స్, యాపిల్ విజన్ ప్రోలు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. మాక్ ఓఎస్, ఐఓఎస్, లైనక్స్, విండోస్కు బ్రౌజర్ ఇంజిన్ ను అందిస్తున్న వెబ్ కిట్లో రక్షణ లోపం కారణంగా ఈ ప్రమాదం ముంచుకు వస్తోందని బ్లీపింగ్ కంప్యూటర్స్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.


హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉన్న యాపిల్ ప్రాడెక్ట్స్..

ఐఫోన్ XS, కొత్త మోడల్స్, ఐప్యాడ్ ప్రో : 13 ఇంచెస్, 12.9 ఇంచెస్, 11 ఇంచెస్ ( మొదటి, తర్వాతి జెనరేషన్స్) ఐప్యాడ్ ఎయిర్( కొత్తతో పాటు మూడవ జనరేషన్), ఐప్యాడ్ ( ఏడవ , తర్వాతి జనరేషన్) ఐప్యాడ్ మిని ( ఐదవ, కొత్త జనరేషన్) మాక్స్ ఓఎస్ సికోవియా, యాపిల్ విజన్ ప్రో.

యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18.3.2, ఐప్యాడ్ ఓఎస్ 18.3.2, మ్యాక్ ఓఎస్ సికోవియా 15.3.2, విజన్ ఎస్ 2.3.2, సఫారీ 18.3.1లలో ఈ సమస్యను పరిష్కరించింది. అనధికారిక కార్యాకలాపాలపై గట్టి వడపోత చేపట్టడం ద్వారా ఈ సమస్యకు చెక్ పడింది. ఈ సమస్యనుంచి బయటపడాలనుకునే వారు వెంటనే తమ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Mar 12 , 2025 | 06:01 PM