Mobile Recharge plans increases: మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలు..
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:06 AM
2024 జులైలో టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఏడాదిగా అవే ప్లాన్లు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలలో 5జీ నెట్‌వర్క్‌కు అనువుగా ధరల పెంపు ఉండొచ్చని జెఫ్రీస్ అంచానా వేస్తోంది.

ఇప్పటికే మొబైల్ రీఛార్జ్ (Mobile Recharge plans) ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? అయితే మీకు మరింత బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది డిసెంబర్ నాటికి జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel) మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 10 నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ (Jefferies) అంచానా వేసింది. 2024 జులైలో టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ఏడాదిగా అవే ప్లాన్లు కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలలో 5జీ నెట్‌వర్క్‌కు అనువుగా ధరల పెంపు ఉండొచ్చని జెఫ్రీస్ అంచానా వేస్తోంది.
మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఈ ఏడాది మే నెల నాటికి 108 కోట్లకు చేరింది. గత 29 నెలల్లో ఇదే గరిష్ట స్థాయి. ఈ కనెక్షన్లలో రిలయన్స్ జియో మార్కెట్ వాటా 53 శాతం కాగా, ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 36 శాతం. మే నెలలో రిలయన్స్ జియోకు 55 లక్షల మంది వినియోగదారులు అదనంగా పెరిగారు. అలాగే ఎయిర్‌టెల్‌కు 13 లక్షల మంది చందాదారులు జత కలిశారు. ఈ మేరకు వోడాఫోన్ ఐడియా నుంచి వినియోగదారులు భారీగా ఈ రెండు టెలికాం నెట్‌వర్క్‌లకు మారిపోయారు.
జియో, ఎయిర్‌టెల్ సంస్థలకు అదనంగా వినియోగదారులు పెరుగుతున్నందున ధరలు పెంచేందుకు ఇదే అనువైన సమయమని జెఫ్రీస్ అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్లాన్‌తో పోల్చుకుంటే 10 నుంచి 12 శాతం మేర ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వేగం, డేటా వినియోగం, సమయం ఆధారంగా ధరలను పెంచుతారని అంచనా వేస్తోంది.
ఇవీ చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి