Stock Market: ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jul 08 , 2025 | 10:49 AM
ఈ రోజు ఆసియా మార్కెట్లన్నీ ఊగిసలాట ధోరణిలోనే కదులుతున్నాయి. అదే రీతిలో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం మాత్రమే లాభాలతో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల పెంపు పేరు చెప్పి బెదిరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లన్నీ ఊగిసలాట ధోరణిలోనే కదులుతున్నాయి. అదే రీతిలో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం మాత్రమే లాభాలతో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. (Business News).
సోమవారం ముగింపు (83, 442)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడుతోంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 2 పాయింట్ల స్వల్ప పాయింట్ల నష్టంతో 83, 440 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 25, 451 వద్ద కొనసాగుతోంది. ట్రంప్ పోకడలతో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రంప్ కొత్తగా 14 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
సెన్సెక్స్‌లో కోటక్ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, ఎన్ఫోఎడ్జ్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్ కంపెనీ, బీఎస్‌ఈ లిమిటెడ్, 306 వన్, ఏంజెల్ వన్, సిప్లా షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 284 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.70గా ఉంది.
ఇవీ చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి