Share News

Airtel: ఎయిర్‌టెల్ ధమాకా ఆఫర్.. రూ.399కే ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్

ABN , Publish Date - May 12 , 2025 | 08:18 PM

దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రూ.399కే బ్రాడ్‌బ్యాండ్, టీవీ సేవలతో పాటు అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.

Airtel: ఎయిర్‌టెల్ ధమాకా ఆఫర్.. రూ.399కే ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్
Airtel rs399 Plan

దేశంలో డిజిటల్ వినోదానికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న భారతీ ఎయిర్‌టెల్ (Airtel) ఇప్పుడు తన బ్లాక్ ప్లాన్ కింద IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సేవలను తక్కువ ధరలకే అందించనున్నట్లు తెలిపింది. ఎయిర్‌టెల్ ఇప్పుడు తన ప్రాథమిక ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లో కూడా IPTV సేవను అందించనుంది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ కేవలం రూ. 399కే లభిస్తుంది. దీంతో తక్కువ బడ్జెట్‌లో IPTVని విక్షించాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.


ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.399 ప్లాన్ వివరాలు

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ. 399 ప్లాన్ అనేది మూడు సేవలను కలిగి ఉన్న కాంబో ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీంతోపాటు 10 Mbps వరకు వేగం పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాదు దీనిలో మీరు IPTV సేవ (350 కంటే ఎక్కువ టీవీ ఛానెళ్ల) ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత ఇంటర్నెట్ కూడా ఉంది. కానీ ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) దీనికి వర్తిస్తుంది. బిల్లింగ్ సైకిల్‌లో 3333GB డేటాను ఉపయోగిస్తే, ఇంటర్నెట్ వేగం 1 Mbpsకి తగ్గుతుంది.


ఇన్‌స్టాలేషన్, హార్డ్‌వేర్ ఖర్చు

కానీ ఈ సేవలను పొందడానికి, వినియోగదారులు ముందుగా రూ.2,500 చెల్లించాలి. ఇందులో అవసరమైన హార్డ్‌వేర్, ఇన్‌స్టాలేషన్ సౌకర్యం ఉంటుంది. ఈ ధర భవిష్యత్ బిల్లులలో సర్దుబాటు చేయబడుతుంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ లేదా OTT యాప్‌లను కలిగి లేనప్పటికీ, ఇది ఎంట్రీ-లెవల్ ప్యాక్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు మరింత వేగం లేదా వినోద సౌకర్యాలను కోరుకుంటే కంపెనీలోని రూ. 599, రూ. 699 వంటి ఇతర ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..


Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..


US-China: ట్రేడ్ వార్‌కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 08:18 PM