Share News

Next Week IPOs: వచ్చే వారంలో 6 కొత్త కంపెనీల ఐపీఓ, మరో 5 కంపెనీల ఎంట్రీ..

ABN , Publish Date - Jun 15 , 2025 | 02:44 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల పండుగ వచ్చింది. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే వారంలో (Next Week IPOs) మార్కెట్ చాలా చురుగ్గా కొనసాగనుంది. ఎందుకంటే ఈసారి కొత్తగా ఆరు ఐపీఓలతోపాటు మరో ఐదు కంపెనీలు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Next Week IPOs: వచ్చే వారంలో 6 కొత్త కంపెనీల ఐపీఓ, మరో 5 కంపెనీల ఎంట్రీ..
Next Week IPOs

భారత స్టాక్ మార్కెట్లో (stock market india) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో (Next Week IPOs) 6 కొత్త పబ్లిక్ ఇష్యూలు రానున్నాయి. ఇప్పటికే మొదలైన 3 ఐపీఓలలో పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఇక లిస్టింగ్ కంపెనీల విషయానికొస్తే 5 కంపెనీలు కొత్త వారంలో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.


జూన్ 16 నుంచి మొదలయ్యే వారంలో కొత్తగా ప్రారంభమయ్యే ఐపీఓలు

సమే ప్రాజెక్ట్ సర్వీసెస్ ఐపీఓ: రూ. 14.69 కోట్ల ఈ ఇష్యూ జూన్ 16న ప్రారంభమై, జూన్ 18న ముగుస్తుంది. ఈ కంపెనీ షేర్లను జూన్ 23న NSE SMEలో లిస్ట్ కానుంది. దీనిని ఒక్కో షేరుకు రూ. 32-34 చొప్పున, 4000 షేర్లలో బిడ్ చేయవచ్చు.

పాటిల్ ఆటోమేషన్ IPO: ఈ ఇష్యూ పరిమాణం రూ. 69.61 కోట్లు. ఇది కూడా జూన్ 16న ప్రారంభమై, జూన్ 18న పూర్తవుతుంది. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 114-120. లాట్ సైజు 1200 షేర్లు. ఇష్యూ ముగిసిన తర్వాత, కేటాయింపు జూన్ 19న ఉంటుంది. షేర్లను జూన్ 23న NSE SMEలో లిస్ట్ చేసుకోవచ్చు.


ఎప్పల్టోన్ ఇంజనీర్స్ IPO: జూన్ 17-19 మధ్య ఒక్కో షేరుకు రూ. 125-128 ధరకు బిడ్ చేయవచ్చు. ఈ కంపెనీ రూ. 43.96 కోట్లు సేకరించాలనుకుంటోంది. లాట్ సైజు 1000 షేర్లు. IPO ముగిసిన తర్వాత, కేటాయింపు జూన్ 20న ఖరారు చేయబడుతుంది. షేర్లు జూన్ 24న NSE SMEలో జాబితా చేయబడతాయి.

అరిసిన్ఫ్రా సొల్యూషన్స్ IPO: ఇది జూన్ 18న మొదలై, జూన్ 20న ముగుస్తుంది. ఈ కంపెనీ రూ. 499.60 కోట్లు సేకరించనుంది. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 210-222. లాట్ సైజు 67 షేర్లు. IPO ముగిసిన తర్వాత, జూన్ 23న కేటాయింపు జరగనుంది. షేర్లను జూన్ 25, 2025న BSE, NSEలో లిస్ట్ కానుంది.


ఇన్‌ఫ్లక్స్ హెల్త్‌టెక్ IPO: ఇది జూన్ 18న ప్రారంభమవుతుంది. రూ. 58.57 కోట్ల ఇష్యూ జూన్ 20 వరకు ఉంటుంది. దీని షేరు ధర రూ. 91-96. 1200 షేర్ల లాట్లలో బిడ్ చేయవచ్చు. ఈ IPO ముగిసిన తర్వాత, జూన్ 23న కేటాయింపు చేస్తారు. ఈ కంపెనీ షేర్లను జూన్ 25న NSE SMEలో లిస్ట్ చేయనున్నారు.

మాయాషీల్ వెంచర్స్ IPO: రూ. 27.28 కోట్ల పరిమాణంతో పబ్లిక్ ఇష్యూ జూన్ 20న మొదలవుతుంది. ఇది జూన్ 24న ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 25న కేటాయింపు చేస్తారు. ఈ IPO షేరుకు రూ. 44-47గా ఉండగా, 3000 లాట్లలో బిడ్ చేయవచ్చు. ఈ కంపెనీ షేర్లు జూన్ 27న NSE SMEలో లిస్ట్ కానున్నాయి.


లిస్ట్ కానున్న కంపెనీలు

కొత్త వారం ప్రారంభంలో సచీరోమ్ షేర్లు జూన్ 16న NSE SMEలో లిస్ట్ కానున్నాయి. జైనిక్ పవర్ అండ్ కేబుల్స్ షేర్లు జూన్ 17న NSE SMEలో ఎంట్రీ అవుతాయి. మోనోలిథిష్ ఇండియా షేర్లు జూన్ 19న NSE SME ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ చేయబడతాయి. అటెన్ పేపర్స్ & ఫోమ్ షేర్లు జూన్ 20న BSE SMEలో లిస్ట్ కానుండగా, మెయిన్‌ బోర్డ్ విభాగంలో ఓస్వాల్ పంప్స్ జూన్ 20న BSE, NSEలో లిస్ట్ చేయబడతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌ మరింత ఈజీ


For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 02:44 PM