YS Viveka Case: వివేకా హత్య కేసులో లోతైన విచారణ జరగాలి: సునీత తరఫు న్యాయవాది
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:09 PM
వైఎస్ వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తి చేశారు. అలా కాకుంటే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. అలాగే ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపితే ఇప్పటి వరకు వెలుగు చూడని పలు సంచలన విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 13: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కుట్ర కోణం దాగి ఉందని సీబీఐ కోర్టుకు వైఎస్ సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు ఆయన విన్నవించారు. అలా కాకుంటే అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. అలాగే ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపితే ఇప్పటి వరకు వెలుగు చూడని పలు సంచలన విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో సప్లిమెంటరి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోర్టును సునీత తరఫు న్యాయవాది లూథ్రా కోరారు. వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ ఆయన కుమార్తె వైఎస్ సునీత గతంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. తన వాదనలు వినిపించారు. తదుపరి విచారణను రేపటికి అంటే.. శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది. రేపు నిందితుల తరఫున వాదనలు కొనసాగనున్నాయి.
2019, మార్చి 14వ తేదీ అర్థరాత్రి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లోని స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఆయన గుండె పోటుతో మరణించారంటూ మీడియాలో వార్త కథనాలు ప్రసారమయ్యాయి. కానీ వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత నిర్ణయించారు. దీంతో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైనట్లు పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతిలోకి వెళ్లింది.
అనంతరం ఈ కేసు విచారణలలో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. అనంతరం ఈ కేసు దర్యాప్తు నెమ్మదించింది. అలాంటి వేళ.. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాలంటూ వైఎస్ సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైఎస్ సునీత దురుద్దేశ్యంతో ఈ పిటిషన్ దాఖలు చేసిందని.. వీటిని కొట్టివేయాలంటూ అందుకు కౌంటర్‌గా కోర్టులో వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డితోపాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కార్తీక మాసం.. ఆఖరి సోమవారం.. ఇలా చేస్తే..
కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
For More Devotional News And Telugu News