Sharmila On Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైఎస్ షర్మిల విమర్శలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:14 PM
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. 'చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్. ఆగస్ట్ 15న మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు.
ఉచిత బస్సు పథకం జిల్లాల వరకే పరిమితం చేస్తారట. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు?. రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం కల్పిస్తే మీకు జరిగే నష్టం ఏంటి?. రాష్ట్రంలో రోజుకు 16 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ చెప్తుంది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి వెళ్లడానికి ఉచితం ఎందుకు ఇవ్వరు?. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం కల్పించండి' అని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. ఇది ప్రమాదకరమైన డ్యాన్స్.. వేదికపై వరుడి డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..