Nara Lokesh: ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: నారా లోకేష్
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:29 PM
రప్పా రప్పా నరుకుత్తం.. నా.., అన్న వస్తాడు.. అంతు చూస్తాడు.., ఎవడైన రానీ.. తొక్కి పడేస్తాం.., 2029 లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని.. అంటూ పెట్టిన వైపీసీ బ్యానర్లను నారా లోకేష్ కోట్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసిపి పార్టీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా కూడా మారిందని లోకేష్ విమర్శించారు. ప్రజల్ని భయకంపితుల్ని చేయాలనుకునే ఇలాంటి చేష్టల్ని ఉపేక్షించేదిలేదని మంత్రి లోకేష్ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్'లో లోకేష్ ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు.
రప్పా రప్పా నరుకుత్తం.. నా.., అన్న వస్తాడు.. అంతు చూస్తాడు.., ఎవడైన రానీ.. తొక్కి పడేస్తాం.., 2029 లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని.. అంటూ పెట్టిన వైపీసీ బ్యానర్లను నారా లోకేష్ కోట్ చేస్తూ పోస్ట్ చేశారు.
'యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి.. సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసిపి పద్ధతి మారలేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం.' అని లోకేష్ అన్నారు.
ఇలా ఉండగా, ఈరోజు రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ ఫుల్ బిజీగా గుడుపుతున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ని లోకేష్ కలిశారు. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని లోకేష్ ఈ సందర్భంగా కోరారు.
పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశానన్న లోకేష్.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు.
రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని కేంద్రమంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనికి బదులుగా అన్నదాతలకు మేలు చేసేందుకు మోదీజీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని.. నూరుశాతం సహకారాన్ని అందిస్తానని కేంద్రమంత్రి పాశ్వాన్ అభయమిచ్చారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్నిలోకేష్ కేంద్రమంత్రికి అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News