Minister Vangalapudi Anita: వైసీపీ నేతలవి మొసలి కన్నీళ్లు
ABN , Publish Date - Jul 24 , 2025 | 05:07 AM
కూటమి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని

మంత్రి అనిత.. చింతలపూడిలో ‘సుపరిపాలన’
చింతలపూడి, జూలై 23(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, అవి అక్రమ అరెస్టులు కావని సిట్ విచారణ జరిపిన తర్వాత తీసుకుంటున్న చర్యలని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ అక్రమ కేసు లు, అరెస్టులంటే వైసీపీ పాలనలో పెట్టిన కేసులేనన్నారు. ప్రజలు రాక్షస పాలనకు తెరదింపి కూటమికి 164 సీట్లు ఇచ్చారని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే ఈ పాలన బాగుంటే వచ్చే నాలుగేళ్లల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న రూపకల్పన జరుగుతోందని తెలిపారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!