Share News

Wife Killed Husband: భర్తను చంపి మూట కట్టిన భార్య.. కట్ చేస్తే 6 నెలల తరువాత..

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:10 PM

రోజు రోజుకు భార్యాభర్తల సంబంధం పలుచబారిపోతోంది. మద్యానికి బానిసై ఒకరు.. అహంభావంతో ఇంకొకరు.. అనుమానంతో మరొకరు.. ఇలా పలు రకాల కారణంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు, ఘర్షణలు చెలరేగుతున్నాయి. వివాహ బంధానికి బీటలు..

Wife Killed Husband: భర్తను చంపి మూట కట్టిన భార్య.. కట్ చేస్తే 6 నెలల తరువాత..
Wife Killed Husband

చిత్తూరు, సెప్టెంబర్ 19: రోజు రోజుకు భార్యాభర్తల సంబంధం పలుచబారిపోతోంది. మద్యానికి బానిసై ఒకరు.. అహంభావంతో ఇంకొకరు.. అనుమానంతో మరొకరు.. ఇలా పలు రకాల కారణంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు, ఘర్షణలు చెలరేగుతున్నాయి. వివాహ బంధానికి బీటలు బారుతున్నాయి. మరికొందరైతే.. తమ భాగస్వాములను ఘోరంగా చంపేస్తున్నారు కూడా. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం వంటి వార్తల నిత్యకృత్యమయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి పట్టణంలో వెలుగు చూసింది. ఓ మహిళ తన తమ్ముడి సాయంతో కట్టుకున్న భర్తను ఘోరంగా చంపేసింది. ఆపై గుట్టు చప్పుడు కాకుండా గోనెసంచిలో శవాన్ని కుక్కి 30 కిలోమీటర్ల దూరంలో ఓ కాలువ గట్టున పాతిపెట్టారు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన.. తాజాగా పోలీసుల విచారణలో బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో రామన్న, రమణమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన రామన్న ప్రతిరోజు భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 12వ తేదీ ఇంటికి వచ్చిన రామన్నను అతని భార్య రమణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్ కలిపి రోకలి బడితో తలపై బలంగా కొట్టి హత్య చేశారు. రామన్న మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి ద్విచక్ర వాహనంపై 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి బి.కొత్తకోట మండలం హంద్రీనీవా కాలువ పక్కన గోతి తీసి పాతిపెట్టారు.


ఈ క్రమంలో తన తమ్ముడు కనపడలేదని రామన్న సోదరుడు లక్ష్మన్న జూన్ నెలలో 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు రమణమ్మ.. ఈశ్వర్‌ను అనుమానితులుగా అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆరు నెలల క్రితం పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి, ఎముకలు వెంట్రుకలను డిఎన్ఏ పరీక్షకు పంపినట్లు డిఎస్పి వెల్లడించారు. హత్య కేసులో నిందితులైన రమణమ్మ, ఈశ్వర్‌లను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు మదనపల్లి డీఎస్‌పీ మహేంద్ర.


Also Read:

Rahul Gandhi: మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై యూఎస్ నిర్ణయంపై రాహుల్ విమర్శ

H1B Visa Fee Hike : హెచ్‌-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 20 , 2025 | 03:31 PM