Waqf Act Controversy: వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:23 AM
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ కర్నూలులో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన వక్ఫ్ చట్ట సవరణ రద్దు చేయాలని ముస్లిం నాయకులు, వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు వేలాదిగా తరలిరావడంతో కలెక్టరేట్ ఎదుట రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ జాకీర్ మౌలానా మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కార్పొరేట్లకు భూములను కట్టబెట్టడానికే వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందన్నారు.
- కర్నూలు, ఆంధ్రజ్యోతి