Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:31 AM
Visakhapatnam Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్‌గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ (Visakhapatnam Mayor) ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. మేయర్‌గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు (Pila Srinivas Rao) ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పిలా శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ (Janasena MLA Vamshi Krishna Yadav) ప్రతిపాదించగా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (BJP MLA Vishnu Kumar Raju) బలపరిచారు. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇదిలా ఉండగా.. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.
కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. కూటమి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును జనసేన, బీజేపీ, కూటమి కార్పొరేటర్లు బలపరిచారు. పోటీలో ఇంకెవరూ లేనందున మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ప్రకటించారు. పీలా శ్రీనివాసరావు మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నిక ధృవపత్రాన్ని జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఆపై విశాఖ నూతన మేయర్‌గా పీలా శ్రీనివాసరావుతో ఎన్నికల అధికారి మయూరి అశోక్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో విశాఖ నూతన మేయర్‌గా కూటమి టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు.
గత నాలుగేళ్లుగా వైసీపీ మేయర్‌గా ఉన్న గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం నెగ్గారు. దీంతో ఈరోజు మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కూటమి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తామని కూటమి నేతలు, కార్పొరేటర్లు స్పష్టం చేశారు. కాగా.. 2021లో విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు బరిలో దిగినప్పటికీ మెజార్టీ లేకపోవడంతో ఆయన ఓడిపోయారు. అయితే నాలుగేళ్లుగా వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పీలాకు తిరిగి ఇప్పుడు అధిష్టానం మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో పీలా విశాఖ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Read Latest AP News And Telugu News