Share News

Pendutrthi పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి

ABN , Publish Date - Jun 24 , 2025 | 09:39 AM

భార్యాభర్తల ఘర్షణతో ఆ ఇల్లాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి నూతిలో దూకింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో చోటుచేసుకుంది.

Pendutrthi పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి

విశాఖపట్నం, జూన్ 24: భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మరణించారు. బావిలో మెట్లు పట్టుకుని కుమార్తె ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.


అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తమ దర్యాప్తులో తెలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె విసిగిపోయి.. ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందని పోలీసులు వివరించారు. ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పేరిట నగదును ఖాతాలో వేసింది. ఈ ఖాతాలోని నగదును తన ఖాతాలోకి మళ్లించాలంటూ భార్యపై భర్త తీవ్ర ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఆ క్రమంలో ఇరువురి మధ్య ఇప్పటికే పలుమార్లు ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత అర్థరాత్రి 3.00 గంటల సమయంలో సైతం వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తన పిల్లలతో కలిసి ఆమె బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే ఈ ఘటనలో తల్లి, కుమారుడు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

దారుణం.. 30 మంది భార్యలు హతం

రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

For Andhrapradesh News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 10:23 AM