Share News

INS Nistar Launch: నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’

ABN , Publish Date - Jul 18 , 2025 | 10:59 AM

INS Nistar Launch: ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ నిర్మాణానికి 120కి పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కంపెనీలు సహకారం అందించాయి. ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది.

INS Nistar Launch: నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’
INS Nistar Launch

విశాఖపట్నం, జులై 18: పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ (INS Nistar) భారత నౌకాదళం (Indian Navy) అమ్ముల పొదలో చేరింది. ఈరోజు (శుక్రవారం) ఐఎన్‌ఎస్ నిస్తార్‌ను కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. డైవింగ్ సపోర్ట్ నౌక ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. ఈ నౌక విశాఖ కేంద్రంగా సేవలు అందించనుంది. ‘ఆత్మనిర్భర్ భారత్‌’లో భాగంగా పూర్థిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఈ నౌకను రూపొందించింది. దాదాపు 15 సార్లు సీ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది ఈ నౌక.


‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ నిర్మాణానికి 120కి పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (MSME) కంపెనీలు సహకారం అందించాయి. ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. సబ్ మెరైన్లలో రెస్క్యూ ఆపరేషన్లు, సబ్ మెరైన్‌లలో సిబ్బందిని అత్యవసరంగా తరలించడానికి , సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని రెస్ట్యూవ్ చేయడానికి ఐఎన్‌ఎస్ నిస్తార్ నౌక ఉపయోగపడుతుంది. ఈ నౌకలో ఎయిర్‌, మిక్స్‌డ్‌ డైవింగ్‌ కాంప్లెక్స్‌ షిప్‌ ఏర్పాటు చేశారు. ఇది 75 మీటర్ల లోతు వరకు డైవింగ్‌ చేయడానికి వీలు ఉంటుంది. అలాగే ఈ నౌకలో మెరైన్‌ క్రేన్‌‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇది సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువును ఎత్తేందుకు సహాయపడుతుంది.


ఇవి కూడా చదవండి..

ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు

ఈ రాశి వారికి మార్పులు బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2025 | 11:03 AM