JS Chandramouli funeral: చంద్రమౌళి ముఖాన్ని చూసి తట్టుకోలేకపోయిన భార్య
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:53 AM
JS Chandramouli funeral: విశాఖ పాండురంగపురం నుంచి చంద్రమౌళి అంతిమయాత్ర మొదలైంది. రాజకీయ నేతలు, ప్రజలు, బంధువులు పెద్ద సంఖ్యల్లో అంత్యక్రియలో పాల్గొన్నారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి (JS Chandramouli) అంతిమయాత్ర ప్రారంభమైంది. పాండురంగపురంలోని చంద్రమౌళి నివాసానికి పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజలు తరలివచ్చారు. ఆయనతో ఉన్న అనుబంధాలను ప్రతీ ఒక్కరూ గుర్తుచేసుకుని భావోద్వేనికి గురవుతున్నారు. అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చంద్రమౌళి మృతదేహాన్ని చూసి భార్య నాగమణి బోరున విలపించింది. చిధ్రమైన ముఖాన్ని చూసి తట్టుకోలేకపోయింది. భార్య, చంద్రమౌళి పిల్లలు కూడా చిధ్రమైన ఆయన ముఖాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈరోజు (శుక్రవారం) ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున స్నేహితులు, బంధువులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు వచ్చి చంద్రమౌళి మృతదేహాన్ని చూసి కన్నీరుపెట్టుకుంటున్న పరిస్థితి. నిన్నటి నుంచి మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. కుటుంబసభ్యులకు కూడా చంద్రమౌళి మృతదేహాన్ని చూసేందుకు అవకాశం లేదు. కాసేపటి క్రితమే చంద్రమౌళి పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించగా... ఆ ప్రాంతమంతా రోదనలతో నిండిపోయింది. ఉగ్రదాడుల్లో చిధ్రమైన చంద్రమౌళి ముఖాన్ని చూసి ప్రతీఒక్కరూ కూడా బోరున విలపించారు. తండ్రి ముఖాన్ని ఇద్దరు కుమార్తెలు హృదవిదారకంగా విలపించారు. అంతేకాకుండా భార్య కూడా ఛిద్రమైన చంద్రమౌళి ముఖాన్ని చూడలేక వెనక్కి వెళ్లిపోయారు. ఇక రాజకీయ నేతలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని చంద్రమౌళికి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) చంద్రమౌళి నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళుర్పించారు. ఆపై ఆయన సతీమణి నాగమణిని ఓదార్చారు. అనంతరం అంత్యక్రియలో హోంమంత్రి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్.. చంద్రమౌళి పాడి మోశారు. పాండురంగపురం చంద్రమౌళి స్వగృహం నుంచి జ్ఞానాపురం స్మశాన వాటికకు చంద్రమౌళి పార్థివదేహం బయలుదేరింది. చంద్రమౌళి అంత్యక్రియలకు స్నేహితులు, బంధువులు భారీగా హాజరయ్యారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లి చంద్రమౌళికి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
Read Latest AP News And Telugu News