Chandramouli Last Rites: ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:56 PM
Chandramouli Last Rites: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అశృనయాల నడుమ, అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి (Chandramouli Funeral) అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు భారీగా బంధువులు, ప్రజలు తరలివచ్చి చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈరోజు ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా.. భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అలాగే మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడి మోసారు. అశృనయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. జ్ఞానాపురం స్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమౌళిని కడసారి చూసేందుకు బంధువులు, వేలాదిగా ప్రజలు అక్కడకు చేరుకున్నారు.
తట్టుకోలేకపోయిన భార్య
అయితే ఉగ్రదాడి అనంతరం స్వగ్రామానికి చేరుకున్న చంద్రమౌళి పార్థివదేహాన్ని గత మూడు రోజులుగా మార్చురీలోనే ఉంచారు. ఈ రోజు ఉదయమే ఆయన పార్థివదేహాన్ని నివాసానికి తరలించారు. అయితే ఆయన మృతదేహాన్ని చూసిన తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు చలించిపోయారు. ఎంతో అందంగా ఉండే తమ తండ్రి ముఖం.. ఉగ్రవాదుల తూటాలకు చిధ్రమైపోవడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. తండ్రి మృతదేహాన్ని పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. అలాగే భార్య నాగమణి కూడా భర్త ముహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. చిధ్రమైన భర్త ముహాన్ని చూసిన వెంటనే వెనకడుగు వేసింది. భర్త పార్థివదేహాన్ని చూసి నాగమణి హృదయవిదారకంగా రోదించడం అందరినీ కంటతడి పెట్టించేలా చేసింది.
ఇవి కూడా చదవండి
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
Read Latest AP News And Telugu News