Share News

ACB court: విడదల గోపికి బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:37 AM

విడదల గోపి బెయిల్‌ మంజూరును కోరుతూ ఆయన న్యాయవాది ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు విచారణను నేటి (మంగళవారం)కి వాయిదా వేసింది

ACB court: విడదల గోపికి బెయిల్‌ ఇవ్వండి

  • ఏసీబీ కోర్టులో ఆయన న్యాయవాది వాదనలు

  • తదుపరి విచారణ నేటికి వాయిదా

విజయవాడ, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): స్టోన్‌ క్రషర్‌ యజమానిని డబ్బుల కోసం బెదిరించిన కేసులో విడదల వేణుగోపాలకృష్ణ (గోపి)కి బెయిల్‌ మంజూరు చేయాలని విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాది నరేంద్ర సోమవారం అభ్యర్థించారు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సమయంలోనే ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై కూడా వాదనలు వినిపించారు. ఈ కేసులో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిపై ఏసీబీ అధికారులు ముందుగా ఐపీసీ 384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారన్నారు. ఇది బెయిలబుల్‌ సెక్షన్‌ కావడంతో తర్వాత బెయిల్‌ రాకుండా ఐపీసీ 386 సెక్షన్‌కు మార్పు చేశారన్నారు.


ఈ కేసులో ఏ1, ఏ4 నిందితులకు 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో గోపి పేరుందని చెప్పారు. గోపిని అరెస్టు చేసిన మర్నాడు హైకోర్టు ఆ తీర్పును ఇచ్చిందని వివరించారు. దీని ప్రకారం గోపికి బెయిల్‌ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనల కోసం విచారణను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:37 AM