TTD: 15 రోజుల్లో ఖాళీ చేయండి
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:52 AM
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణాలతో సంబంధించి టీటీడీ 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. కోర్టు తీరుపై అభిప్రాయంతో మఠాన్ని తిరిగి అప్పగించాలని అధికారుల ఆదేశాలు

తిరుమలలో శారదాపీఠానికి నోటీసులు
తిరుమల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో విశాఖ శారద పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు మఠం మొత్తాన్ని ఖాళీ చేసి తనకు అప్పగించాలని పేర్కొంది. కొండపై నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారని టీటీడీ గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేయడం.. మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడం.. స్టే రావడం తెలిసిందే. టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఎలాంటి తప్పూ లేదని కోర్టు తీర్పు ఇవ్వడంతో.. 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి అప్పగించాలని శనివారం అధికారులు నోటీసులు జారీ చేశారు. దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ ఆరోపిస్తోంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తొలుత ప్రకటించినా.. భవనా న్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది.