Share News

TTD: ఐదు టీటీడీ పెద్ద హోటళ్లకు టెండర్ల ఖరారు

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:57 AM

తిరుమలలోని ఐదు టీటీడీ పెద్ద హోటళ్లకు టెండర్ల ఖరారయ్యాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు రుచికరమైన, నాణ్యమైన

TTD: ఐదు టీటీడీ పెద్ద హోటళ్లకు టెండర్ల ఖరారు

  • 18 గంటల పాటు జరిగిన ప్రక్రియ

తిరుమల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని ఐదు టీటీడీ పెద్ద హోటళ్లకు టెండర్ల ఖరారయ్యాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇకపై బ్రాండెడ్‌ హోటళ్ల నిర్వాహకులకే టీటీడీ హోటళ్లను కేటాయించాలని టీటీడీ బోర్డు తీర్మానించిన విషయం తెలిసిందే. ఎక్కువ ధరకు టెండరు వేసే వారికి హోటళ్లను కేటాయించడం ద్వారా వారు భక్తులపై ఆ భారాన్ని మోపుతున్నారని టీటీడీ భావించింది. అందుకని ఈసారి ముందస్తుగానే హోటళ్లకు అద్దెను నిర్ణయించి కొన్ని ప్రత్యేక నిబంధనలతో ఓపెన్‌ టెండర్లను ఆహ్వానించింది. రూ.5 కోట్ల టర్నోవర్‌, పదేళ్ల అనుభవం, పలు ప్రాంతాల్లో హోటళ్లను సమర్థంగా నిర్వహిస్తున్నట్టు ఆధారాలు వంటి వివిధ రకాల ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో పెద్ద హోటళ్ల కోసం దాదాపు 102 దరఖాస్తులు టీటీడీకి అందాయి. దీంతో సోమవారం ఉదయం తిరుమలలోని రెవెన్యూ కార్యాలయంలో ఎస్టేట్‌, విజిలెన్స్‌, హెల్త్‌ విభాగాల ఆధ్వర్యంలో టెండర్ల కోసం వచ్చి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. ఒక్కో అప్లికేషన్‌కు పదుల సంఖ్యలో పత్రాలున్న క్రమంలో పరిశీలన ప్రక్రియ మంగళవారం వేకువజాము 5 గంటల వరకు కొనసాగింది. టీటీడీ నిబంధనల ప్రకారం అర్హులైన వారి అప్లికేషన్లను డిప్‌ తీయగా హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు, చెన్నై, ముంబై, గుజరాత్‌కు సంబంఽధించి సంస్థలకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిని మరోసారి పరిశీలించి బోర్డు తీర్మానం తర్వాత హోటళ్లను ఆయా సంస్థలకు అప్పగించేలా టీటీడీ అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 05:57 AM