Share News

Kommareddy Pattabhiram: తిరుమల కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది: కొమ్మారెడ్డి

ABN , Publish Date - Nov 10 , 2025 | 06:22 PM

తిరుమల ప్రసాదంలో కల్తీ ఘటనపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోందని చెప్పారు. తిరుమల పవిత్రతను జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దెబ్బ తీసి మహాపాపానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kommareddy Pattabhiram: తిరుమల కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది: కొమ్మారెడ్డి
Kommareddy Pattabhiram

అమరావతి, నవంబర్ 10: వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. ధన దాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అంటూ కోట్లాదిమంది భక్తులు బాధపడ్డారని చెప్పారు. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుమల పవిత్రత దెబ్బ తీసి మహాపాపానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో భోలే బాబా డైరీకి సుగంధ ఆయిల్ అండ్ కెమికల్స్ సంస్థ ప్రమాదకర రసాయనాలు సరఫరా చేసి టీటీడీకి నెయ్యి ఇచ్చిందన్నారు.


వైసీపీ హయాంలో పామాయిల్ పేరుతో తప్పుడు బిల్లులతో 6.5 లక్షల కిలోల మోనోగ్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్‌లతో నెయ్యి తయారు చేశారని కొమ్మారెడ్డి మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు భోలే బాబా 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ.251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి వాడి ఇంకా సమర్థించుకుంటారా? అంటూ ఫైర్ అయ్యారు. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేసి, పారదర్శకంగా ఉన్నామని సిగ్గులేకుండా చెప్పుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


2022లో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు నెయ్యిలో పామాయిల్ కలిసినట్టు నివేదికలు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కల్తీ నెయ్యిలో సుబ్బారెడ్డి ప్రమేయం లేకపోతే, భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్‌ను ఎందుకు కలిశారని మండిపడ్డారు. చిన్న అప్పన్నని అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డికి కమిషన్లు ముట్టాయి కాబట్టే కాంట్రాక్టులు కొనసాగించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో కమిషన్ల కోసం తెలిసి స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారని సిట్ రిమాండ్ రిపోర్ట్ తేల్చి చెప్పిందన్నారు. కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పాత్ర లేకపోతే, బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలు ఇవ్వమని సిట్ అడిగితే ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. ఒక్క లీటర్ కొనుగోలు చేయకుండా ప్రమాదకర రసాయనాలతో చేసిన నెయ్యిని వైసీపీ పెద్దలు రూ.320కి టెండర్ ఫైనల్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం

రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు.. ఎవరెవరంటే.?

Updated Date - Nov 10 , 2025 | 07:50 PM