Share News

Tirumala: డబ్బులు వసూలు చేసి సర్వ దర్శనం క్యూలోకి..

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:14 AM

తిరుమలలో క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సులభంగా స్లాటెడ్‌ సర్వ దర్శనం చేయిస్తామని చెప్పి..

Tirumala: డబ్బులు వసూలు చేసి సర్వ దర్శనం క్యూలోకి..

  • తిరుమలలో వెలుగుచూసిన దళారుల దందా

తిరుమల, జూలై 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలో క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సులభంగా స్లాటెడ్‌ సర్వ దర్శనం చేయిస్తామని చెప్పి దళారీలు భక్తుల దగ్గర రూ.1500 చొప్పున వసూలు చేశారు. వారితో చేతులు కలిపిన టీటీడీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ఎమర్జెన్సీ గేటు తెరిచి, 24 మంది భక్తులను క్యూలైన్‌లోకి పంపాడు. బుధవారం జరిగిన ఈ ఘటనపై, విచారణ తర్వాత సెక్యూరిటీ గార్డును గురువారం రాత్రి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా.. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఎస్‌ఎ్‌సడీ టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తుల వద్దకు కె.వెంకటేష్‌, డి.వెంకటేష్‌ అనే ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు వెళ్లి నేరుగా ఉచిత దర్శనం క్యూలోకి పంపిస్తామని చెప్పి 24 మంది నుంచి రూ.1500 చొప్పున వసూలు చేశారు. తిరుమలలో టాక్సీ క్లీనర్‌ వెంకటే్‌షకు వీరిని అప్పగించారు. అతను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 వద్ద విధులు నిర్వహించే టీటీడీ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డు పి.సాయికుమార్‌కు రూ.8 వేలు ఇచ్చి భక్తులను క్యూలైన్‌లోకి పంపాలని కోరాడు. గార్డు ఏకంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ప్రధాన ద్వారం సమీపంలోని ఎమర్జెన్సీ గేట్‌ తాళాలను వెంకటేశ్‌‌కు ఇచ్చేశాడు. ఉదయం 8 గంటలకు ఈ ద్వారం నుంచి 24 మందినీ లోపలికి పంపాడు. వారు టోకెన్లు తీసుకుని బయటకు వచ్చేసి, తమకు కేటాయించిన సమయం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు అదే ద్వారం వద్దకు దర్శనం కోసం వచ్చారు. అనుమానంతో విజిలెన్స్‌ అధికారులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరు ట్యాక్సీ డైవర్లు, క్లీనర్‌ వెంకటే్‌షతో పాటు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డు సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని, గురువారం రాత్రి తిరుమల టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:14 AM