TG Venkatesh: సమష్టి కృషితో తెలుగు భాషను కాపాడుకుందాం
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:33 AM
సమష్టి కృషితో తెలుగు భాషను కాపాడుకుందామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ పిలుపునిచ్చారు.

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు కల్చరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితో తెలుగు భాషను కాపాడుకుందామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రం ఆడిటోరియంలో రెండు రోజులుగా కొనసాగిన రాష్ట్రస్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు మాట్లాడేవారంతా పెద్ద సంఖ్యలో సదస్సుకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అందుకు తగిన సహకారం అందిస్తామని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో తమ మాతృభాషను ఎలా కాపాడుకుంటున్నారో గుర్తించి ఆ దిశగా మాతృభాషను ఉద్దరించుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో చెన్నపురి తెలుగు అకాడమీ అధ్యక్షుడు తూమాటి సంజీవరావు రచించిన ‘విశిష్ట తెలుగు - దిగ్దర్శనం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.