AP Politics: వైఎస్ జగన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత..
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:40 PM
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

నెల్లూరు, జులై 31: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా డీఎస్పీ సింధుపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు.. లాఠీలు చుపుతూ వైసీపీ మూకలను తరిమేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి.. ఆర్ అండ్ బీ బంగ్లా దగ్గర రోడ్డుపై బైఠాయించారు. తమ అనుచరులందరినీ రమ్మంటూ ఫోన్లలో సందేశాలు పంపించారు. భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు.. రప్పా రప్పా అంటూ భయానకంగా నినాదాలు చేశారు. దీంతో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గందరగోళం, ఉద్రిక్తత నెలకొంది.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్‌కి ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రోడ్డు ప్రయాణంలో జగన్ ఎక్కడంటే అక్కడే కాన్వాయ్ ఆపుతూ అభివాదాలు చేసుకుంటూ వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి బొమ్మ సెంటర్ వద్ద జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పోలీసులను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాగా, పలు కేసుల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో వైఎస్ జగన్ గురువారం నాడు ములాఖత్ అయ్యారు. జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన ప్రసన్నకుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. ఇదిలాఉంటే.. జగన్ రాక సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు వైసీపీ నేతలు. జనసమీకరణ కోసం రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జన సమీకరణ కోసం లిక్కర్, క్వార్ట్జ్ స్కాముల ద్వారా సంపాదించిన డబ్బునే వారు వినియోగించారని నెల్లూరులో బిగ్ టాక్ నడుస్తోంది.
Also Read:
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకున్న జనాదరణ ఇదీ
For More Andhra Pradesh News and Telugu News..