Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:47 PM
Padma Awards: గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.

ఢిల్లీ: భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మా అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్ర సర్కారు ఎంపిక చేసింది. మొత్తం 139 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిగా.. అందులో తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం.
పద్మ అవార్డులు అందుకున్న తెలుగు తేజాలు వీరే..
పద్మ విభూషణ్: దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, వైద్యం
పద్మ భూషణ్: నందమూరి బాలకృష్ణ, కళారంగం
పద్మశ్రీ: కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం (ఏపీ)
మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం (ఏపీ)
మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు (తెలంగాణ)
మిరియాల అప్పారావు (మరణానంతరం), కళారంగం (ఏపీ)
వి రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య (ఏపీ)
బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించారు: సీఎం చంద్రబాబు
పద్మభూషణ్ అవార్డు పొందిన హీరో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించారని ప్రశంసించారు. సినిమా, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య అంకితభావం, ప్రజాసంక్షేమాన్ని కాంక్షించి పని చేశారని ఉద్ఘాటించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా చేసిన సేవలు కూడా వెలకట్టలేనివని చంద్రబాబు ప్రశంసించారు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ పూర్తిగా అర్హుడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.